Posani Krishna Murali : గత కొద్ది రోజులుగా పోసాని కృష్ణ మురళి .. నారా లోకేష్‌ని టార్గెట్ చేస్తూ ఆయనపై దారుణమైన విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. లోకేష్ వలన తనకు ప్రాణహాని కూడా ఉందని సంచలన కామెంట్స్ చేశాడు. ఈ క్రమంలోనే ఆయన ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిని కలిసి తనని చంపేందుకు లోకేష్ బాబు కుట్రపన్నారని.. తనకి ప్రాణ రక్షణ కల్పించాలని కోరారు పోసాని. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో.. లోకేష్, చంద్రబాబులపై కీలక వ్యాఖ్యలు చేశారు. ‘నన్ను టీడీపీలో చేర్చుకోవడానికి లోకేష్ అతని పీఏ చైతన్య ద్వారా ప్రయత్నాలు చేశారు.. నేను చేరకపోవడంతో నాపై కక్ష పెంచుకున్నారు.. వాళ్లు చేస్తున్న తప్పుల్ని బహిర్గతం చేయడంతో నన్ను చంపడానికి ప్లాన్ చేస్తున్నారు.
లోకేష్ ముందు నేనెంత? ఆయన ముందు నేనెంత?? లోకేష్ కళ్లు తెరిస్తే నేను కైలాసంలో ఉంటా. అంత పెద్ద వాడి ముందు నేను తూగలేను. నేను చాలా చిన్నోడిని. ప్రతిపక్షంలో ఉన్న వాళ్లు.. మాట్లాడితే చాలు.. అధికారంలోకి వస్తాం.. వచ్చాక బట్టలూడదీస్తాం అంటున్నారు. బట్టలిప్పి ఏం చూస్తార్రా నాయనా.. అందరూ బట్టలిప్పేవాళ్లే. బట్టలిప్పి ఏం చేస్తారు.. ఏం చూస్తారు? మహా అయితే మొలతాడు చూస్తారంతే. ప్రతివాడు బట్టలిప్పేవాడే. బట్టలిప్పే కొడతారట. లోకేష్ బాబుకి బట్టలిప్పడం అలవాటేమో. నువ్వు ఏం చేయాలో జనానికి చెప్పాలి కానీ.. బట్టలిప్పుతా.. అందులో పెడతా.. ఇందులో పెడతానంటా రేంటి? లోకేష్‌ది చంద్రబాబు మెంటాలిటీ. తనకి కావాల్సిన దాని కోసం ఎంతకైనా తెగిస్తాడు అని షాకింగ్ కామెంట్స్ చేశాడు.
అప్పట్లో రామారావుని ఆధారాలు పెట్టుకుని వెన్ను పోటు పొడవలేదు కదా. లోకేష్ బాబు నాపైనే ఎందుకు పగపట్టాడంటే.. నేను ఎక్కువగా మాట్లాడుతున్నాను కాబట్టి. నేనేం పవర్ ఫుల్ కాదు.. నా నోరే పవర్ ఫుల్. నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. పెళ్లి అయిన తరువాత చంపేసినా పర్లేదు. నేను ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయను.. చేసినా గెలవను. నాకు ఎలక్షన్ మేనేజ్‌మెంట్ తెలియదు. జగన్ అంటే నాకు పిచ్చి.. జగన్ అంటే నాకు ఇష్టం.. ఆయనంటే నాకు ప్రాణం. జగన్ గారు గెలిచిన తరువాత కాదు.. అంతకు ముందు నుంచి కూడా నేను జగన్ గారిని ఇష్టపడుతున్నాను. నేను సినిమా వాడ్ని కాబట్టి.. సినిమాకి సంబంధించిన పదవి ఇచ్చారు. ఈ పదవిని నేను ఈజీగా డీల్ చేస్తున్నా’ అంటూ చెప్పుకొచ్చారు పోసాని కృష్ణ మురళి.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…