Poonam Kaur : వరంగల్ వైద్య విద్యార్థిని ప్రీతి సూసైడ్ కేస్ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ ఘటన మీద పొలిటికల్ లీడర్లు స్పందించడంతో దీనిపై రాజకీయ రంగు పులిమినట్టు అయింది. ఈ కేస్ కాస్త లవ్ జిహాదిగా కూడా మారింది. బండి సంజయ్ చేసిన కామెంట్ల మీద సోషల్ మీడియా నుంచి భిన్నమైన స్పందన వస్తోంది. అయితే సైఫ్ అనే వ్యక్తి మాత్రం ప్రీతిని వేధించినట్టుగా పోలీసులు గుర్తించడంతో ఆయనకు రిమాండ్ విధించారు. ప్రీతి మాత్రం చావు బతుకుల మధ్య పోరాడుతుంది.
ఎక్మో ద్వారా ప్రీతికి చికిత్సను అందిస్తున్నారని, వెంటిలేటర్ మీద ఉందని హెల్త్ బుల్లిటెన్‌ను వైద్యులు వదులుతున్నారు. అయితే ఆమె ఇంకా ప్రాణాలతో బతికే ఉన్నా కూడా పూనమ్ కౌర్ మాత్రం వింతగా ట్వీట్ వేసింది. ఆమె చనిపోయినందన్నట్టుగా ట్వీట్ వేసింది. ‘మనుగడ , పరువు , న్యాయం మధ్య మరో అమ్మాయి ప్రాణం తీసింది . వైద్య కళాశాలలో ప్రవేశించడానికి చాలా కష్టపడి పనిచేసిన తరువాత, ఆమె తన కలలను వదులుకోవలసి వచ్చింది. ఆమె తల్లిదండ్రులు దీని నుండి ఎప్పటికీ కోలుకోలేరు. ఏ శిక్ష అయినా నొప్పికి సరిపోదు లేదా న్యాయం పొందదు’ అంటూ పూనమ్ కౌర్ ట్వీట్ చేసింది.
పూనమ్ కౌర్ చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ ‘కాస్త తెలుసుకుని ట్వీట్లు వేయండి.. ఆమె ఇంకా బతికే ఉంది.. మీరు ఇలా ఇష్టమొచ్చినట్టుగా ట్వీట్లు వేయొద్దు’ అని తిడుతున్నారు. కాగా, పూనమ్ కౌర్ సినిమాల కన్నా కూడా వివాదాలతోనే ఎక్కువగా వార్తలలో నిలుస్లూ ఉంటుంది. ఆమె చేసే ట్వీట్స్ ఒక్కోసారి సంచలనంగా మారుతూ ఉంటాయి. పూనమ్ చేసే కామెంట్స్, ఆమె పెట్టే ట్వీట్స్ ఎప్పుడు చర్చనీయాంశం అవుతూనే ఉంటాయి.