Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఈపేరుకి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. కేవలం నటుడిగానే కాదు రాజకీయ నాయకుడిగా కూడా సత్తా చాటుతున్నాడు. పవన్ ఇప్పుడు రాజకీయాలతో ఎంత బిజగా ఉన్నప్పటికీ మధ్య మధ్యలో సినిమాలు చేస్తూ అలరిస్తున్నాడు. ఆయన ఖాతాలో ఇప్పుడు పలు క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. హరిహర వీరమల్లు, ఓజీ, హరీష్ శంకర్ దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తుంది. ఇక రీసెంట్‌గా ఓ తమిళ చిత్రం రీమేక్ చేసేందుకు కూడా సిద్దమయ్యాడు. సముద్రఖని దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ఇటీవల పూజా కార్యక్రమాలు జరుపుకుంది.
ఈ సినిమాకి సంబంధించి కొన్ని ఫోటోలు విడుదల కాగా, ఓ ఫొటోలో సాయి ధరమ్ తేజ్ కుర్చీలో కూర్చుని ఉంటే.. పవన్ కళ్యాణ్ అతని భుజం చేయి వేసిన స్టిల్ చూస్తే.. మెగా ఫ్యాన్స్‌కి ఫుల్ మీల్స్ అన్నట్టుగానే ఉంది.. బ్లాక్ షర్ట్ & కార్గో జీన్స్ కాంబినేషన్‌లో పవన్ కళ్యాణ్ డ్రెస్సింగ్ స్టైల్ అదిరిపోయింది. ‘వినోదయ సీతమ్’ కి రీమేక్ కాగా.. ఈ చిత్రానికి సంబంధించి ఇంట్రస్టింగ్ అప్డేట్స్ వైరల్ అవుతున్నాయి. ఒకటి ఈ సినిమా టైటిల్ కాగా.. రెండోది ఈ సినిమాకి పవన్ కళ్యాణ్ తీసుకునే రెమ్యూనరేషన్. పవన్ కళ్యాణ్ ఒక్కో సినిమాకి వద్దంటే.. రూ. 100 కోట్లు తక్కువ కాకుండా రెమ్యూనరేషన్ తీసుకుంటారనే టాక్ ఉంది.
అయితే పవన్‌కి ఉన్న మార్కెట్ ప్రకారం.. ఆయన ప్రతి సినిమాకి రూ.100 కోట్లు పైనే రెమ్యూనరేషన్ ఇస్తారనే టాక్ ఉంది. అయితే ‘వినోదయ సీతమ్’ రీమేక్‌లో ఆయన పాత్ర నిడివి తక్కువే కావడంతో పాటు.. పవన్ కళ్యాణ్ బిజీ షెడ్యూల్ వల్ల కేవలం కేవలం 15-20 రోజులు మాత్రమే డేట్స్ ఇచ్చారట. ఈ 15-20 రోజులకు గానూ రూ.50 కోట్లు రెమ్యూనరేషన్ ఇస్తున్నారనేది లేటెస్ట్ అప్డేట్. ఈ లెక్కన 15 రోజులంటే రోజుకి రూ. 3.3 కోట్లు అన్నమాట. గంటకి చూస్తే.. సరాసరి రూ.9.2 లక్షలు అన్నమాట. ఇక నిమిషానికి.. సెకన్లకు కూడా లక్షలు, వేలల్లోనే ఉంది . మొత్తానికి ఆయన రెమ్యునరేషన్ మాత్రం ఇప్పుడు టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది.