Ponguleti Srinivas Reddy : తెలంగాణలో మార్పు కావాలని కోరుకున్న ప్రజల కోసం అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కి టీడీపీ మద్దతు ప్రకటించగా, ఆ పార్టీ భారీ విజయం సాధించింది. ఈ క్రమంలో తెలంగాణలో మార్పు కోరుకున్న ప్రజల కోసం కాంగ్రెస్‌కు టీడీపీ మద్ధతు పలికిందని పొంగులేటి అన్నారు. కాంగ్రెస్ గెలుపు కోసం నిద్రాహారాలు మాని పనిచేశారని.. తమకు సహకరించినవారిని ఎప్పుడూ మర్చిపోనని శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. టీడీపీకి ఎలాంటి ఉపయోగం లేకపోయినా.. తమ ప్రయోజనాలను కూడా పక్కనపెట్టి 119 నియోజకవర్గాల్లోనూ కాంగ్రెస్‌కు పూర్తి మద్ధతు పలికారని ఆయన తెలిపారు. భవిష్యత్తులో అందరం కలిసి పనిచేద్దామని పొంగులేటి తెలిపారు.
ప్రస్తుతం పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వ్యాఖ్యలు తెలంగాణలో కలకలం రేపుతున్నాయి. అయితే లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలోనే పొంగులేటి ఈ వ్యాఖ్యలు చేశారనే వాదనలు వినిపిస్తున్నాయి. తమకు సహకరించినవారిని ఎప్పుడూ మర్చిపోనని చెప్పారు పొంగులేటి శ్రీనివాస రెడ్డి. టీడీపీకి ఎలాంటి ప్రయోజనం లేకపోయినా…. తమ ప్రయోజనాన్ని కూడా పక్కనబెట్టి.. 119 నియోకవర్గాల్లో కాంగ్రెస్‌కు పూర్తి మద్దతు ప్రకటించారని చెప్పారు. టీడీపీ, కాంగ్రెస్ రెండూ వేర్వేరు కాదని… రెండు పార్టీలు ఒకటేనని చెప్పారు పొంగులేటి. అధికారంలో లేమని టీడీపీ నేతలు బాధపడాల్సిన అవసరంలేదని… భవిష్యత్‌లో అందరం కలిసి పనిచేద్దామని చెప్పారు.
![Ponguleti Srinivas Reddy : టీడీపీ ఆఫీసులో చంద్రబాబుని ఆకాశానికి ఎత్తిన పొంగులేటి.. వారి వల్లే మేము గెలిచాం..! Ponguleti Srinivas Reddy sensational comments on chandra babu](http://3.0.182.119/wp-content/uploads/2024/02/ponguleti.jpg)
పొంగులేటి వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్ నేతలు మండిపడుతున్నారు. లోపాయికారీ ఒప్పందాలతో… కుట్ర రాజకీయాలు చేసి… అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచిందని ఆరోపిస్తున్నారు. అందుకు…పొంగులేటి వ్యాఖ్యలే నిదర్శనమని చెపున్నారు బీఆర్‌ఎస్ నేతలు. ఒప్పుడు పొంగులేటి చెప్పిన మాటలే… తాము ముందు నుంచి చెప్తూ వచ్చామన్నారు. కాంగ్రెస్ నేతలంతా టీడీపీ ఏజెంట్లేని తాము చేసిన ఆరోపణలు నిజమని పొంగులేటి తన మాటలతో నిరూపించారని అంటున్నారు గులాబీ పార్టీ నేతలు. లోపాయికారి ఒప్పందంలో భాగంగానే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ పోటీచేయలేదని అన్నారు. కాంగ్రెస్, టీడీపీతో చీకటి ఒప్పందం కుదుర్చుకుని… కుట్రలు చేశారని మండిపడుతోంది.