పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాలలోకి వచ్చాక ఆయనపై వైసీపీ నాయకులు ఏ రేంజ్లో విమర్శలు గుప్పిస్తున్నారో మనం చూస్తూనే ఉన్నాం. అయితే పవన్‌ని విమర్శించే సమయంలో చాలా మంది ఆయన మూడు పెళ్లిళ్ల ప్రస్తావన తీసుకు వస్తున్నారు. తన పైన వైసీపీ నేతలు చేస్తున్న పెళ్లిళ్ల విమర్శల పైన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందిస్తూ.. సరదా ఉంటే మీరు కూడా విడాకులు ఇచ్చి మూడు పెళ్లిళ్లు చేసుకోండి అంటూ సమాధానం ఇచ్చారు. తాను మూడు పెళ్లిళ్లు చేసుకున్నానని వైసీపీ నేతలకు ఈర్ష్యగా ఉందన్నారు. తాను మూడు పెళ్లిళ్లు చేసుకున్నానని..మూడు రాజధానులు తీసుకొస్తున్నారా అని పవన్ ఓ మీటింగ్‌లో ప్రశ్నించారు.
తాజాగా ఇదే మూడు పెళ్లిళ్ల అంశం గురించి బాలయ్య అన్‌స్టాపబుల్ షోలో ప్రశ్నించారు. వాళ్లు బాధపడతారేమో అని అంటూ.. నా విజ్ఞత, సంస్కారం మాట్లాడకుండా ఆపేస్తుందని అన్నారు. దీనిపై మరింతగా పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చినట్టు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ ఈ సారి ఇచ్చే సమాధానం విమర్శకుల నోర్లు మూయిస్తుందా చూడాలి. బాలయ్య – పవన్ ఎపిసోడ్ రెండు పార్ట్ లుగా ప్రసారం కానుంది. మొదటి పార్ట్ ఫిబ్రవరి 3న ప్రసారం చేయబోతున్నట్టు తెలిపారు. ఇది `ఆహా`లో స్ట్రీమింగ్ కానుంది. ప్రస్తుతం ఈ ప్రోమో తెగ వైరల్ అవుతోంది.
జనసేన పార్టీ స్థాపించి రాజకీయాల్లో అడుగుపెట్టినప్పటి నుంచి పవన్ కళ్యాణ్‌కి కు ఇదే ప్రశ్న ఎదురవుతోంది. కానీ పవన్ కళ్యాణ్ ఎప్పుడూ దీనిపై ఇంత క్లారిటీ ఇవ్వలేదు. ఈ సారి మాత్రం విమర్శకుల నోళ్లు మూయించేలా పవన్ సమాధానం ఇచ్చాడని తెలుస్తుంది. ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’, ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రాల్లో నటిస్తున్నారు. అలాగే దర్శకుడు సుజీత్ డైరెక్షన్ లోనూ ఓ చిత్రంలో నటించబోతున్నారు. మరోవైపు పొలిటికల్ షెడ్యూల్ లోనూ పాల్గొంటూ బిజీగా ఉంటున్నారు.