Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఈ పేరు చెబితే అభిమానులు పూనకం వచ్చినట్టు ఊగిపోతుంటారు. ఆయనకు అభిమానులు కన్నా భక్తులు ఉన్నారని చెప్పవచ్చు. ప్రస్తుతం వరుసగా సినిమాలను చేస్తున్నారు. అంతేకాదు ఏపీ రాజకీయాల్లోను చురుగ్గా పాల్గోంటున్నారు. ప్రస్తుతం ఆయన ఓ మూడు సినిమాల్లో నటిస్తూనే.. ఏపీలో వారాహి యాత్రను ప్రారంభించిన సంగతి తెలిసిందే. తన పార్టీ ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉంటున్న నేపథ్యంలో పవన్ సినిమాలన్నీ అక్కడే షూటింగ్‌ను జరుపుకుంటున్నాయి. అయితే ఈ సారి ఎలాగైన అధికారం దక్కించుకోవాలని పవన్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇటీవల హీరోల అభిమానులను రైతులకు అండగా నిలబడాలని కోరారు. మహేష్ బాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్, చిరంజీవి, బాలకృష్ణ, ప్రభాస్ అందరి హీరోల అభిమానులకు విజ్ఞప్తి. నాకు వారందరూ ఇష్టమే.. నేను వారి సినిమాలు చూస్తాను.. మీరు వారిని అభిమానించండి. రైతులకు, ప్రజా సమస్యలకు కులం లేదు. వారికి అండగా నిలబడాలి అంటూ కోరారు . పవన్ వస్తున్న దారులైతే జనసంద్రంగా మారుతున్నాయి. ఒకవైపు బహిరంగ సమావేశాలు, మరోవైపు పలువురితో చర్చలు జరుపుతూ పవన్ బిజీబిజీగా గడుపుతున్నారు.
![Pawan Kalyan : పూజారి ప్రవర్తన చూసి షాకైన పవన్ కళ్యాణ్.. మరీ ఇంత అభిమానమా..! Pawan Kalyan surprised by temple priest attitude](http://3.0.182.119/wp-content/uploads/2023/06/pawan-kalyan-12.jpg)
అయితే పవన్ కళ్యాణ్ ఈ రోజు పూజారులని కలిసారు. అందులో ఒక మూగ పూజారి పవన్‌కి వీరాభిమాని. ఆయన పవన్‌ని హత్తుకుంటూ తన మనోభావాలని ప్రదర్శించారు. పూజారి ప్రేమని చూసి పవన్ సైతం ఆశ్చర్యపోయారు. తన వీరాభిమానితో కలిసి ఫొటో కూడా దిగారు. ప్రస్తుతం ఇందకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. పవన్‌కి పూజారులు సన్మానం చేసి ఆశీస్సులు అందించారు. అలానే క్రిస్టియన్ మత గురువులు కూడా పవన్‌కి ఆశర్వచనాలు అందించారు. ఇక రేపటితో పవన్ వారాహి యాత్ర ముగియనున్నట్టు తెలుస్తుండగా, మరి కొద్ది రోజుల పాటు తన సినిమా షూటింగ్స్ తో బిజీ కానున్నారు. వినోదయ సీతమ్ అనే తమిళ సినిమాను తెలుగులో బ్రో ది అవతార్ అనే పేరుతో రీమేక్ చేస్తున్నారు. ఆకట్టుకునే కంటెంట్‌తో వచ్చి తమిళ్‌లో విజయాన్ని అందుకున్న ఈ సినిమాను తెలుగులో సముద్రఖని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం మరి కొద్ది రోజులలో విడుదల కానుంది.