Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్, ఆయన రేంజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరిగా ఉన్న పవన్ ప్రస్తుతం సినిమాలు చేస్తూనే మరోవైపు రాజకీయాలపై కూడా దృష్టి సారిస్తున్నారు. భీమ్లా నాయక్ తర్వాత పవన్ క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు అనే సినిమా చేస్తుండగా, ఈ సినిమా షూటింగ్ కోసం యూనిట్ అంతా సన్నద్దంగా ఉంది. వర్క్ షాప్ ఫోటోలను చిత్ర యూనిట్ రిలీజ్ చేయడంతో.. ట్విట్టర్ మోత మోగిపోయింది. వర్క్ షాప్ ఫోటోలలో పవన్ కళ్యాణ్‌ని చూసి మెగా అభిమానులు మురిసిపోయారు. తమ అభిమాన హీరో అదిరిపోయాడంటూ ట్వీట్స్ చేస్తున్నారు.
అయితే వర్క్‌షాప్‌లో పవన్ కళ్యాణ్ ధరించిన షూస్, వాచ్‌పై ఇప్పుడు అందరి దృష్టి పడగా, వాటి రేట్‌పై ఆసక్తికర చర్చ నడుస్తుంది. ఫోటోలలో పవన్ ధరించిన వాచ్ ఖరీదు దాదాపు 14,37,000గా ఉంది. అంటే అక్షరాలా 14 లక్షల 37 వేలు. ఇక షూస్ ధర అయితే 10 లక్షలు అని అంటున్నారు. నిజానికి ఆ షూ ధర దాదాపు 119 యూరోస్. ఆ లెక్కన చూస్తే పవన్ కళ్యాణ్ వేసుకున్న షూ ధర రూ.9,600 మాత్రమే కానీ.. పది లక్షలు అంటూ ట్రోల్ చేస్తున్నారు. ఏదేమైనా పవర్ స్టార్ మాత్రం ఫుల్ స్టైలిష్ లుక్స్‌లో కనిపించడంతో అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.
![Pawan Kalyan : పవన్ షూస్, వాచ్ ల అసలు ధరలు ఇవే.. అనవసరంగా నిందిస్తున్నారు..! Pawan Kalyan shoes and watch real price do not blame him](http://3.0.182.119/wp-content/uploads/2022/10/pawan-kalyan-watch-shoes.jpg)
సాధారణంగా పవన్ కళ్యాణ్ చాలా సింపుల్‌గా ఉంటారు. పొలిటికల్ ప్రెస్ మీట్లు, పర్యటనలో ఆయన చాలా సాధరణమైన బట్టల్లో కనిపిస్తుంటారు. హంగు ఆర్భాటలకు పవన్ చాలా దూరమని ఆయన ఫ్యాన్స్ అంటుంటారు. కానీ ఇప్పుడు ఇంత రిచ్‌గా కనిపించడం హాట్ టాపిక్ అయింది. ఇక పవన్ కళ్యాణ్.. హరి హర వీరమల్లు సినిమా తరువాత హరీష్ శంకర్ చిత్రం కూడా చేయనున్నాడు. అంతకు ముందు సముద్రఖని దర్శకత్వంలో వినోదయ
సీతం రీమేక్ చేయబోతోన్నట్టు తెలుస్తోంది. ఇందులో సాయి ధరమ్ తేజ్ కీలక పాత్ర పోషిస్తున్నాడు.