Pawan Kalyan : ఇటీవల తెలంగాణ ఎన్నికలపై ఫోకస్ పెట్టిన పవన్ కళ్యాణ్ పలు ప్రాంతాలలో ప్రచారం చేశారు. రిజల్ట్ ఎలా ఉన్నా కూడా పవన్ కళ్యాణ్ పర్యటనకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ పై దృష్టి పెట్టారు. శుక్రవారం నాడు జనసేన పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ నేతలతో పవన్ కళ్యాణ్ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. పవన్ అధ్యక్షతన జరిగిన భేటీలో నాదెండ్ల మనోహర్, నాగబాబు, రాష్ట్రస్థాయి నేతలు పాల్గొన్నారు. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలపై పోరాట కార్యాచరణ ప్రకటించారు. ఓటర్ల జాబితాలో అవకతవకలపై జనసేన నేతలతో చర్చించారు.
జనసేన, టీడీపీ ఉమ్మడిగా చేపట్టాల్సిన కార్యక్రమాలపై ఈ సందర్భంగా చర్చించారు. అనంతరం పవన్ మీడియాతో మాట్లాడుతూ…‘‘వైసీపీ వంటి పార్టీలకు ఈ పరిణామాలు ఇబ్బంది అనిపిస్తాయి. బీజేపీ, టీడీపీతో ఎలా కలుస్తారని నన్ను అంటున్నారు. అసలు నన్ను విమర్శించే అర్హత వైసీపీలో ఎవరికీ లేదు. నేను ఏ నిర్ణయం తీసుకున్నా అది ప్రజలు క్షేమం, రాష్ట్ర అభివృద్ధే ముఖ్యంగా తీసుకుంటాను. జనసేనకు యువతే పెద్ద బలం. రాష్ట్రంలో జనసేనకు ఆరున్నర లక్షల క్యాడర్ ఉంది. నేను మొదట్నుంచీ పదవులు కోరుకోలేదు. స్వార్థం వదిలేయాలని నేతలను కోరుతున్నాను. చేసే పని, పోరాటమే మనకు గుర్తింపు ఇస్తుంది. యువత ధైర్యంగా ముందుకు వచ్చి ఓటు వేయాలని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు.
ఇతర రాష్ట్రాల యువత కూడా మనకు మద్దతిస్తున్నారు. జనసేన యువత బలం చూసి బీజేపీ పెద్దలే ఆశ్చర్యపోయారు. నన్ను, నా భావజాలాన్ని నమ్మే యువత వస్తున్నారు. నేనేం చేసినా దేశ సమగ్రత గురించే ఆలోచిస్తాను. నేను మొదట్నుంచీ పదవులు కోరుకోలేదు. స్వార్థం వదిలేయాలని నేతలను కోరుతున్నాను. చేసే పని, పోరాటమే మనకు గుర్తింపు ఇస్తుంది. టీడీపీతో పొత్తు వెనక పెద్ద కారణ ఉంది. మనం సింగిల్‌గా వెళ్తే దాడులు చేస్తున్నారు. మెగాస్టార్, సూపర్ స్టార్‌లపై విమర్శలు చేస్తున్నారు. యూట్యూబర్‌లని బెదిరిస్తున్నారు. ఇలాంటప్పుడు ఏం చేయాలి అంటూ పవన్ అన్నారు. రెండు పార్టీల మధ్య పొత్తుకు వ్యతిరేకంగా ఏ స్థాయి నాయకులు మాట్లాడినా.. చిన్న కార్యకర్త మాట్లాడినా ఊరుకునేది లేదన్నారు. అలాంటివారిని వైఎస్సార్‌సీపీ కోవర్టులుగా భావిస్తానని హెచ్చరించారు పవన్.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…