Pawan Kalyan : ఇటీవల జరిగిన వారాహి విజయ యాత్ర సభలో పవన్ కళ్యాణ్ వైసీపీపై నిప్పులు చెరిగారు. ముఖ్యమంత్రితో పాటు పలువురు మంత్రులపై కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. జనసేన అధికారంలోకి వస్తేనే చేనేతల సమస్యలు పరిష్కారం అవుతాయని పవన్ కళ్యాణ్ అన్నారు. తాము అధికారంలోకి వస్తే ఎవరికి ఏ ఇబ్బంది రాకుండా చూసుకుంటామని అన్నారు. తాను వైసీపీ దౌర్భాగ్యులతో సరదాగా మాటలు అనిపించుకోవడం లేదని, ఒక ఆవేదనతో పని చేస్తున్నానని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఈ ఒక్కసారి తనకి అవకాశం ఇవ్వాలని కూడా తాను తెలియజేశారు. పదేళ్ల నుంచి అధికారం లేకపోయినా.. రోడ్ల మీద తిరిగి, ప్రజా సమస్యల్ని తాము పరిష్కరిస్తున్నామని పేర్కొన్నారు.
పదేళ్ల పాటు జనసేన పార్టీకి అధికారాన్ని కట్టబెడితే.. అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తానని చెప్పారు. కుల రాజకీయాలకు తాము స్వస్తి చెప్తామని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోతే రెండేళ్ల తర్వాత రాజీనామా చేస్తామని పవన్ ప్రకటించారు. ప్రలోభాలు దాటి జనసేన పార్టీని గెలిపించాలని పిలుపునిచ్చారు.అయితే గాంధీలా మనం ఒక చెంపపై కొడితే మరొక చెంప చూపించే రోజులు పోయాయని, మనపై దాడులు చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని పవన్ కళ్యాణ్ వార్నింగ్ ఇచ్చారు.
![Pawan Kalyan : పవన్ కళ్యాణ్ మాటలు వింటే.. రోజాకి చెమటలు పట్టాల్సిందే..! Pawan Kalyan sensational comments on roja](http://3.0.182.119/wp-content/uploads/2023/06/pawan-kalyan-1-1.jpg)
సినిమాలు ఆపుకో, వ్యాపారాలు ఆపుకో.. ఏమైన చేసుకో.. మమ్నల్ని ఎవడు ఆపేది.. ఇది మా నేల కాదా.. మీ ఒక్కళ్లకేనా చేతులు ఉండేది. ఏ వైసీపీ నాయకుడైన మమ్మల్ని తిట్టేప్పుడు ఒక్కసారి ఆలోచించుకోండి. మేం చాలా పడి ఉన్నాం. మేం అధికారంలోకి వచ్చాక మా గురించి ఎవడైతే తప్పుగా మాట్లాడారో వారికి మా విశ్వరూపం చూపిస్తామంటూ పవన్ కళ్యాణ్ అన్నారు. పవన్ కామెంట్స్ తో వైసీపీ నాయకులు గుండెల్లో వణుకు మొదలైందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. గతంలో రోజా కూడా పవన్‌పై తీవ్ర విమర్శలు చేసింది. ఈ కామెంట్స్ రోజాకి కూడా తగులుతతాయని జనసైనికులు అంటున్నారు.