Pawan Kalyan : పవన్ కళ్యాన్ సినిమా హీరోగా ఉన్నప్పుడు జనాలకు చాలా దూరంగా ఉండే వారు. తన పని తాను చేసుకుంటూ వెళ్లేవారు. ఎప్పుడో తన సినిమా వేడుకలలో మాత్రమే కనిపించేవాడు. ఇప్పుడు రాజకీయాలలోకి వచ్చిన తర్వాత మాత్రం నిత్యం హాట్ టాపిక్ అవుతున్నాడు. వైజాగ్‌లో జనవాణి సభ ప్లాన్ చేయగా, దానికి వైసీపీ అడ్డుపడడంతో పవన్ కళ్యాణ్ ప్రెస్‌మీట్లలో ప్రభుత్వ తీరుని ఎండగడుతున్నారు. తాజాగా విజయవాడ వేదికగా మీడియా, కార్యకర్తలతో మాట్లాడారు. ఈ సందర్భంగా పవన్ సంచలన కామెంట్స్ చేశాడు.
నా కొడకల్లారా అంటూ ప్రెస్ మీట్‌లో వైసీపీ నాయకులకు చెప్పు తీసి చూపించారు. విశాఖలో జరిగిన దాడులు.. జనసైనికుల అరెస్టులపై స్పందించిన పవన్ కళ్యాణ్ వీరావేశంతో ఊగిపోయారు. ఈసారి అన్నింటికీ మించి పీక్స్ అనేట్టుగా పవన్ కళ్యాణ్ చెలరేగారు. తనని ప్యాకేజీ స్టార్ అంటూ వైసీపీ నాయకులు చేస్తున్న విమర్శల్ని తిప్పికొట్టారు పవన్ కళ్యాణ్. తాను ఎన్ని సినిమాలు చేశారు.. ఎంత సంపాదించారు.. అందులో టాక్స్ ఎంత కట్టారు? జీఎస్టీ ఎంత? పార్టీ నడపడానికి ఎంత అవుతుంది? బిల్డంగ్ కట్టడానికి ఎంత ఖర్చు అయ్యింది తదితర వివరాలు తెలియజేశారు.
![Pawan Kalyan : తన మాజీ భార్యలకు ఎంత ఆస్తులు ఇచ్చాడో చెప్పిన పవన్ కళ్యాణ్..! Pawan Kalyan said how much he has given for his ex wives](http://3.0.182.119/wp-content/uploads/2022/10/pawan-kalyan-1.jpg)
మూడు పెళ్లిళ్లు చేసుకున్నానని విమర్శిస్తే ఊరుకునేది లేదన్న పవన్ కావాలంటే మీరు కూడా మూడు పెళ్లిళ్లు చేసుకోండి. నేను విడాకులు ఇచ్చి మూడు పెళ్లిళ్లు చేసుకున్నాను. మొదటి భార్యకు రూ. 5 కోట్ల డబ్బులు ఇచ్చాను. రెండో భార్యకు మిగిలిన ఆస్తి ఇచ్చాను. వారిద్దరితో నాకు వర్క్ అవుట్ కాలేదు. మీరు ఒక్క పెళ్లి చేసుకొని 30 స్టెప్నిలతో కనెక్షన్స్ పెట్టుకుని నన్ను విమర్శిస్తున్నారా అంటూ పవన్ ఊగిపోయాడు. కాగా, పవన్ తన మొదటి భార్య నందికి రూ. 5 కోట్ల రూపాయలు విడాకుల భరణంగా ఇవ్వగా, రేణు దేశాయ్ కి తన ఆస్తి ఇచ్చాను అన్నారు.