Pawan Kalyan : సినీ పరిశ్రమకి, రాజకీయానికి అవినాభావ సంబంధం ఉంటుందనే విషయం తెలిసిందే.కొన్ని సార్లు రాజకీయ నాయకులు చేసే కామెంట్స్‌పై సినీ ప్రముఖులు కూడా ఆసక్తికర కామెంట్స్ చేస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం.. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సినిమా ఇండస్ట్రీ నుంచి ఆయనతో సన్నిహితంగా మెలిగిన ప్రముఖులు చాలా మందే ఉన్నారు. అయితే, ఇప్పుడు చంద్రబాబు నాయుడిని స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో అరెస్టు చేస్తే దానిపై సినిమా పరిశ్రమ నుంచి పెద్దగా ఎవ్వరూ స్పందించడంలేదని విమర్శలు వస్తున్నాయి. అసలు వాళ్లు ఎందుకు స్పందించడంలేదు అనేది చాలా మంది ప్రశ్న. అయితే రోజాపై టీడీపీ నేత చేసిన విమర్శలకి గాను ఆమెకి సపోర్ట్‌గా పలువురు హీరోయిన్స్ స్పందిస్తున్నారు. దీనిపై పవన్ కళ్యాణ్ ఆసక్తికర కామెంట్స్ చేశారు.
వైఎస్ జగన్ భయంతోనే చంద్రబాబు అరెస్టుపై స్పందించేందుకు టాలీవుడ్ పెద్దలు ముందుకు రావడం లేదనే చర్చ జరుగుతోంది. అయితే పవన్ కళ్యాణ్ తాజాగా దీనిపై స్పందిస్తూ టాలీవుడ్ ఎందుకు మౌనంగా ఉండిపోతోందన్న అంశంపై తన అభిప్రాయం వెల్లడించారు. గతంలో చంద్రబాబుకు మద్దతుగా రజనీకాంత్ వ్యాఖ్యలు చేసినప్పుడు వైసీపీ నేతలు ఆయన్ను ఎలా టార్గెట్ చేశారన్నది గుర్తుచేసిన పవన్ కళ్యాణ్.. ఇప్పుడు కూడా టాలీవుడ్ లో ఎవరైనా స్పందిస్తే అలాగే టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు. రజనీకాంత్ లాంటి ఎంతో ప్రజాదరణ కలిగిన గొప్ప నటుడినే నోటికొచ్చినట్టు తిట్టారని.. ఆయనే తట్టుకోలేనప్పుడు మిగిలిన చిన్నచిన్న నటులు వైసీపీ దాడిని ఎలా తట్టుకోగలని ప్రశ్నించారు. సినీ పరిశ్రమలో కూడా రెండు వర్గాలు ఉంటాయని.. ఎన్టీఆర్ సమయం నుంచే రెండు పార్టీలకు చెందిన మనసులు ఇండస్ట్రీలో ఉండేవారని గుర్తుచేశారు.
ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు సినిమా ఇండస్ట్రీలో వేర్వేరు రాజకీయ వర్గాలు ఉన్నాయి. కృష్ణ, ప్రభాకర్‌రెడ్డి లాంటి వాళ్లు కాంగ్రెస్‌కు బలమైన మద్దతుదారులు. తెలుగుదేశంకి సంబంధించిన మద్దతురాలు సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు. కాంగ్రెస్‌కు చెందినవాళ్లు ఉన్నారు. వారంతా ఇప్పుడు వైసీపీ మద్దతుదారులుగా మారిపోయి ఉండొచ్చు. అలాగే నాకు కొద్దిగా మద్దతు ఏమైనా ఉంటుందోమో నాకు తెలీదు. మనస్పూర్తిగా చెప్పాలంటే నేనే అంతగా ఆలోచించను’ అని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన మీద తీయని సినిమా లేదు. మండలాదీశుడు దగ్గర నుంచి తీస్తూనే వచ్చారు. కోట శ్రీనివాసరావుతో తీశారు. ఆఖరికి మన పృథ్వీతో కూడా తీశారు. సినిమా పరిశ్రమలో మీ రాజకీయ అభిప్రాయం మీది తీసుకోండి అని ఆ తరవాత కలిసి కూడా నటించిన దాఖలాలు ఉన్నాయి. కానీ వీళ్లు కక్ష సాధింపుకు పాల్పడుతున్నారు’ అని వైసీపీని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ అన్నారు.