Pawan Kalyan Home : ప్రస్తుతం నటుడిగా ,రాజకీయ నాయకుడిగా సత్తా చాటుతున్నారు పవన్ కళ్యాణ్. ఆయన ఎంత ఎదిగిన ఒదిగి ఉండేందుకు ఇష్టపడుతుంటారు. చాలా నిరాడంబరంగా ఉండేందుకు ఇష్టపడతారు. తక్కువ మాట్లాడడం, ఏదో ఒక పనిలో నిమగ్మమై ఉండడం, పుస్తకాలు ఎక్కువ చదవడం పవన్ చేస్తుంటారు. అనవసరంగా ఎవరినీ నొప్పించ కూడదు. వీలైతే ఒకరికి సహాయం చేయాలి కానీ… నాశనం చేయకూడదని ఆయన గట్టిగా నమ్ముతారు. నిస్వార్ధ జీవనం కొనసాగించే పవన్ కళ్యాణ్ ని అన్నయ్య చిరంజీవితో పాటు చాలా మంది కొనియాడారు. ఒక దశలో పవన్ కళ్యాణ్ కి సొంత ఇల్లు కూడా లేదన్న పచ్చి నిజం బయటపెట్టారు.
చిరంజీవి మాట్లాడుతూ… పవన్ నాకు బిడ్డతో సమానం. తనను నేను ఎత్తుకొని పెంచాను. సురేఖను తల్లిలా ప్రేమిస్తాడు. మేమిద్దరం అంటే పవన్ కి అమితమైన అభిమానం. పవన్ కి ఆవగింజంత స్వార్థం కూడా ఉండదు. డబ్బు సంపాదించాలి కూడబెట్టాలనే యావ ఉండదు. పదవీ కాంక్ష అంతకన్నా లేదు. . ఒక దశలో పవన్ కి సొంత ఇల్లు కూడా లేదు. ఎప్పుడూ సమాజం గురించి ఆలోచిస్తాడు. సమాజానికి ఏదైనా చేయాలనే తపన పవన్ కళ్యాణ్ లో ఉంటుంది. అందుకే రాజకీయాలలోకి వెళ్లారు. ఏపీ రాజకీయాలపై ఫుల్ ఫోకస్ పెట్టిన పవన్ కళ్యాణ్ పార్టీ బలోపేతంతో పాటూ కార్యకర్తలకు మరింత దగ్గరవ్వాలని రాజధాని ప్రాంతమైన విజయవాడలో ఓ ఇంటిని కొనుగోలు చేశారు.
ఆ ఇల్లు చూస్తూ ఫ్యూజులు ఎగిరిపోవల్సిందే. ఎకరం స్థలంలో నిర్మించుకున్న పవన్ చుట్టూ పచ్చని చెట్లు ఉంచేలా ప్లాన్ చేసుకున్నారు. కేరళ స్టైల్‌లో చాలా అందంగా కనిపిస్తుంది. వైట్ అండ్‌మెరూన్ కలర్‌లో ఈ ఇల్లు అందంగా సుందరీకరించబడింది. ఈ ఇల్లు 50 కోట్ల రూపాయల వరకు ఉంటుందని ఓ సమాచారం. డూప్లెస్ హౌజ్ ఇంటీరియర్ కూడా తనకి నచ్చినట్టు చేయించుకున్నారట. లగ్జరియస్ గా కాకుండా చుట్టూ ఎంత అందంగా, ప్రత్యేకంగా చేయించుకున్నారు. ఆయన ట్రెండ్ సెట్ కారు. సెట్ చేస్తారని ఆయన ఇల్లు చూసిన వారు అంటున్నారు.