Pawan Kalyan : ఏపీ సీఎం జగన్ చేస్తున్నది దిగజారుడు రాజకీయాలు అని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పదే పదే చెబుతూ వస్తున్నారు. రాజకీయాలలో విలువలు నిలబెట్టేలా తాను వ్యవహరిస్తుంటే అధికార పార్టీ వైసీపీ నేతలు దిగజారి మాట్లాడుతున్నారని, తనను వ్యక్తిగతంగా దూషిస్తూ పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక దిగజారి మాట్లాడుతున్న జగన్‌ని నువ్వు అని ఏకవచనం తోనే పిలుస్తాను అని ఏలూరు సభలో చెప్పుకొచ్చారు. మర్యాద పుచ్చుకోలేని వారికి ఇవ్వడమూ అనవసరం అన్నారు పవన్. సీఎం పదవికి జగన్ అనర్హుడు అని, వైసీపీ నేతల అన్యాయం, దుర్మార్గాలపై ప్రశ్నిస్తున్నానన్న కోపంతోనే తనను పెళ్లిళ్లు అని, లేక ఇంట్లో ఆడవారిపై వ్యాఖ్యలు చేస్తూ వ్యక్తితంగా దాడి చేయించడం అందుకు నిదర్శనం అన్నారు.
ఇక తాడేపల్లి గూడెం సభలో ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేసిన పవన్ కళ్యాణ్.. జగన్‌కి కూడా విష్ చేస్తూ నేను పవన్ కళ్యాణ్.. జనసేన పార్టీ అధ్యక్షుడిని అంటూ ఆంధ్రా యాసలో చెప్పుకొచ్చారు. ఇక తాను రాజకీయాల్లోకి ఎంతో ఇష్టంగా వచ్చానని..జగన్ మద్దతుదారులు నీచంగా మాట్లాడుతున్నారని పవన్ అన్నారు. కొంతకాలంగా జగన్ కూడా దిగజారి మాట్లాడుతున్నారని పవన్ ఆరోపించారు. తనకు వాలంటీర్లంటే కోపం లేదని..ఈ వాలంటీర్ వ్యవస్థకు అధిపతి ఎవరని పవన్ ప్రశ్నించారు. వాలంటీర్లు చేసే అరాచకాలకు ఎవరు బాధ్యత వహిస్తారని పవన్ నిలదీశారు.
బూమ్ బూమ్ బీర్ కంటే వాలంటీర్ల రోజు వారి జీతం చాలా తక్కువని అన్నారు. ఏపీలో మద్యం కంటే వాలంటీర్ల జీతాలే తక్కువని పవన్ అన్నారు. తాను ఏనాడూ సీఎం జగన్ ను, జగన్ సతీమణి భారతిని ఒక్క మాట కూడా అనలేదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. కేవలం మేము పాలసీల మీదనే మాట్లాడమని ఆయన చెప్పుకొచ్చారు. ఇక తానంటే ముస్లింలకు చాలా ఇష్టమని..కాకపోతే బీజేపీ వెంట ఉండడంతో తనను ముస్లింలు నమ్మడం లేదని పవన్ పేర్కొన్నారు. మొత్తానికి తాడేపల్లి గూడెంలో పవన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయాలలో కాస్త హట్ టాపిక్‌గా మారాయి.