Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో టీడీపీ, జనసేన పొత్తులో భాగంగా ఇటీవల జెండా పేరుతో తొలి బహిరంగ సభ జరిగింది. ఈ సభలో చంద్రబాబు, నందమూరి బాలకృష్ణ, పవన్ కల్యాణ్‌తోపాటు పలువురు రాజకీయ నేతల ప్రసంగాలు ట్రెండింగ్‌గా మారాయి. అయితే టీడీపీ అధినేత చంద్రబాబు ప్రసంగం సందర్భంగా పవన్ కల్యాణ్ చేసిన ముసిముసి నవ్వులు నవ్విన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తృతంగా చక్కర్లు కొడుతున్నది. జెండా సభలో పవన్ కల్యాణ్ తీవ్ర స్థాయిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ధ్వజమెత్తారు. భీమ్లా నాయక్ సినిమా టికెట్లను కలెక్షర్ల ద్వారా అమ్మించడానికి చేసిన ప్రయత్నంలో భాగంగా నొక్కిన బటన్ తప్ప.. తెలుగు సినిమా పరిశ్రమకు ముఖ్యంగా ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధికి చేసిందేమీ లేదు అని పవన్ కల్యాణ్ అన్నారు.
చంద్రబాబు మాట్లాడుతూ.. బటన్స్ నొక్కడం, అవినీతికి పాల్పడటం, అక్రమ కేసులు పెట్టడం పక్కన పెడితే.. హు కిల్డ్ బాబాయ్ (బాబాయ్‌ని ఎవరు చంపారు?) అంటూ పదే పదే గట్టిగా అరిచిన సమయంలో కార్యకర్తలు, అభిమానుల నుంచి భారీగా స్పందన వచ్చింది. సభ జరిగినంత సేపు చంద్రబాబు ఓ రేంజ్‌లో పవన్ కల్యాణ్‌కు ఎలివేషన్ ఇచ్చారు. పవన్ మాట్లాడినంత సేపు చంద్రబాబు ఆసక్తితో వింటూ.. చిరునవ్వులు కూడా నవ్వాడు. జగన్‌ను నిన్ను పాతాళానికి తొక్కేస్తా.. అలా తొక్కకపోతే నేను పవన్ కల్యాణ్ కాదు.. నా పార్టీ జనసేన కాదు అంటూ చేసిన వ్యాఖ్యలు ట్విట్టర్‌లో టాప్ ట్రెండింగ్‌గా నిలిచాయి. 47 సెకన్లపాటు సాగిన మాస్ వార్నింగ్ ట్విట్టర్‌లో భగభగలు సృష్టించాయి.
ఇక ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ పార్టీకి 24 సీట్లు కేటాయించడం కూడా చర్చనీయాంశంగా మారింది. జనసేన, టీడీపీ కార్యకర్తలు కలిసి పని చేయాలి. ప్రతి ఒక్క కార్యకర్తకి న్యాయ చేస్తాం. నేతలు ఎవరు ఎగువకి పోవద్దు. ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ కాదు. రెండు పార్టీలు కలిసి ముందుకు వెళుతున్నాం. మా పరిస్థితి అర్ధం చేసుకున్న వారికి శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాం. రాష్ట్రానికి న్యాయం చేయాలని పవన్ నేను మహా ఉద్యమానికి శ్రీకారం చుట్టాం. కలసి పని చేయండి, కష్టపడి పని చేయండి మీకు అన్యాయం చేయం. మన పొత్తు సూపర్. ఆంధ్రప్రదేశ్ అన్‌స్టాపబుల్ అంటూ చంద్రబాబు పవర్ ఫుల్ స్పీచ్ ఇచ్చారు.