Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు తెలుగు రాష్ట్రాల్లో ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం సినిమాలతో పాటు ఆయన రాజకీయాలలోను యాక్టివ్‌గా ఉన్నారు. ప్రస్తుతం ఆయన డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో హరి హర వీరమల్లు సినిమాలో నటిస్తున్నారు. ఇందులో నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తుంది. అటు ఈ సినిమా కంప్లీట్ కాకముందే డైరెక్టర్ కమ్ నటుడు సముద్రఖని దర్శకత్వంలో మరో ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇవే కాకుండా..డైరెక్టర్ హారిశ్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్, సాహో ఫేమ్ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నారు పవన్. పాలిటిక్స్, మూవీస్ అంటూ క్షణం తీరిక లేకుండా గడిపేస్తున్న పవర్ స్టార్ చిత్రాల కోసం కొంతకాలంగా అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.
అయితే పవన్ కోసమే కాదు పవన్ తనయుడి కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా గమనిస్తున్నారు. అకీరా కనిపించాడంటే ఆయన పిక్ నెట్టింట తెగ వైరల్ కావడం ఖాయం. అకీరా సినిమాలలోకి ఎప్పుడు ఎంట్రీ ఇస్తాడా అని ప్రతి ఒక్కరు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇటీవల అకీరీ ఎంట్రీపై స్పందిస్తూ అందరిలానే నాకు కూడా అకీరా బిగ్ స్క్రీన్ పై చూడలని వుందని చెప్పుకొచ్చారు రేణు. ఇదే క్షణంలో అకీరాకి హీరో అవ్వాలనే ఆసక్తి ఇప్పరివరకూ రాలేదని చెప్పారు.” అకీరాది చాలా భిన్నమైన వ్యక్తిత్వం. తను పియానో, ఫిల్మ్ ప్రొడక్షన్, యోగా, మార్సల్ ఆర్ట్స్, కిక్ బాక్సింగ్ ఇవన్నీ నేర్చుకున్నాడు.
![Pawan Kalyan : కొడుకు అకీరాతో పవన్ కళ్యాణ్ సందడి మాములుగా లేదు..! Pawan Kalyan fun with his son akira nandan](http://3.0.182.119/wp-content/uploads/2023/11/pawan-kalyan-1.jpg)
తనకి రైటింగ్ ఇష్టం. ఒక స్క్రిప్ట్ కూడా రాశాడు. అయితే ఇప్పటివరకూ నటుడిని అవుతానని మాత్రం చెప్పలేదు. తను హీరో అవ్వాలని డిసైడ్ అయితే అందరికంటే ముందు నేనే ప్రకటిస్తా” అని చెప్పుకొచ్చారు రేణు. అయితే అప్పుడప్పుడు పవన్, అకరాకి సంబంధించి పిక్స్, వీడియోలు వైరల్ అవుతుంటాయి. తాజాగా పవన్ కళ్యాణ్, అకీరా ఆడుకుంటున్న వీడియో సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. ఇది చూసిన నెటిజన్స్ తెగ మురిసిపోతున్నారు.