Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాలతో పాటు రాజకీయాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. అయితే కృష్ణా జిల్లా మచిలీపట్నంలో నిర్వహించిన జనసేన 10వ ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ పాల్గొని, కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కొన్ని విమర్శలకు సమాధానంగా తన రెమ్యునరేషన్ కూడా చెప్పి ఆశ్చర్యపరిచాడు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. తనకు రూ. 1,000 కోట్లు ఆఫర్ చేశారని కొందరు దుష్ప్రచారం చేశారని పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. మరోసారి ఇలాంటి దుష్ప్రచారం చేస్తే చెప్పతో కొడతానని తీవ్రంగా హెచ్చరికలు జారీ చేశారు.
తాను, 20 రోజులు సినిమా చేస్తే.. రూ. 40 కోట్ల నుంచి రూ. 45 కోట్లు వస్తాయని.. తాను డబ్బులు కోసం ఆశపడే వ్యక్తిని కాదన్నారు. ప్రస్తుతం రోజుకు 2 కోట్ల పారితోషికం తీసుకుంటున్నారట పవర్ స్టార్. అలాంటప్పుడు నాకు అమ్ముడు పోవల్సిన అవసరం ఏంటీ..? రాజకీయంగా మాటలు పడాల్సి అసవరం నాకు ఏంటీ..? ప్రజలకు మంచి చేయడానికి వచ్చాను. ఇవే నేను వద్దు అనుకుంటే సినిమాలు చేస్తూ హ్యాపీగా ఉండేవాడిని కదా అని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ప్రస్తుతం తమిళ మూవీ వినోదయ సితం రీమేక్ లో నటిస్తున్నారు పవర్ స్టార్.
తమిళ దర్శకుడు, నటుడు సముద్రఖని ఈసినిమాకు దర్శకత్వం వహిస్తుండగా, ఈసినిమాకు పవర్ స్టార్ 44 కోట్లు తీసుకున్నట్టు ఆయన మాటల ద్వారా అర్ధమైంది. ఇక ఈసినిమాతో పాటు హరీష్ శంకర్ డైరెక్షన్ లో చాలా కాలంగా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా పెండింగ్ లో ఉంది. ఈ సినిమాలతో పాటు క్రిష్ డైరెక్షన్ లో హరిహరవీరమల్లు సినిమా కూడా షూటింగ్ దశలోనే ఉంది. కాగా, రాష్ట్రంలో అకాల మరణం చెందిన 47 మంది కౌలు రైతుల కుటుంబాలకు రూ. లక్ష చొప్పున పవన్ కళ్యాణ్ ఆర్థిక సాయం అందించారు.