Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెండో భార్య రేణు దేశాయ్ నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు. వారిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో ఆమె పవన్‌కు విడాకులు ఇచ్చారు. పవన్‌తో విడాకుల అనంతరం రేణు తన ఇద్దరు పిల్లలతో కలిసి పూణేలో తన తల్లిదండ్రుల వద్దే ఉంటోంది. పవన్ కళ్యాణ్, రేణుదేశాయ్ విడిపోయి ఎవరి లైఫ్ వారు లీడ్ చేస్తున్నారు. అయితే.. ఇంతకాలం సినిమాలకు దూరమైనా రేణు దేశాయ్ కి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సపోర్ట్ మాత్రం అలాగే ఉంది. ఓ మంచి తల్లిగా, పిల్లలను తండ్రికి దగ్గరగా ఉంచుతూ వస్తున్న రేణుదేశాయ్ అంటే పవన్ ఫ్యాన్స్ కి ఎంతో అభిమానం.
ఇదిలావుండగా ఇటీవల పవన్ కళ్యాణ్ రాజకీయ కార్యక్రమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. కొన్నిరోజుల క్రితం పవన్ కళ్యాణ్ ఉమ్మడి గుంటూరు జిల్లాలోని ఇప్పటం గ్రామానికి వెళుతూ కారు టాప్ పై కూర్చుని ప్రయాణించారు. ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. పవన్ అలా కారు టాప్ పై ప్రయాణించడంతో ఏపీ పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే పవన్ కళ్యాణ్ ఇప్పటంలో ఇళ్ళు కోల్పోయిన ప్రజలని పరామర్శించేందుకు అలా కారు టాప్ పై ప్రయాణించారు. ఏది ఏమైనా ఈ సంఘటన వివాదంగా మారింది.
![Pawan Kalyan : తండ్రికి ఏమాత్రం తీసిపోని ఆద్య.. నాన్నలాగే కూతురు అంటూ రేణు దేశాయ్ పోస్ట్.. Pawan Kalyan daughter adya on car top renu desai post](http://3.0.182.119/wp-content/uploads/2022/11/pawan-kalyan-adya.jpg)
ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూతురు ఆద్య కూడా కారు టాప్ పై ప్రయాణించింది. అచ్చం పవన్ కళ్యాణ్ లాగే పైకి కాకపోయినా.. కారు టాప్ డోర్ ఓపెన్ చేసి ప్రయాణించింది. ఈ వీడియోను రేణు దేశాయ్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. నాన్న లాగే కూతురు అంటూ ఈ వీడియోకి రేణు దేశాయ్ క్యాప్షన్ ఇచ్చారు. ఆద్య తండ్రికి ఏమాత్రం తీసిపోదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇలా ప్రయాణించేటప్పుడు జాగ్రత్తలు తీసుకుంటే బెటర్ అని నెటిజన్లు సూచిస్తున్నారు. పవన్ అభిమానులు ఈ వీడియోని తెగ షేర్ చేశారు.