Pawan Kalyan Assets : టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరిగా ఉన్న పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాలతోపాటు రాజకీయాలతో బిజీగా ఉన్నారు. చిరంజీవి తమ్ముడిగా సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టినప్పటికీ తన సొంత ప్రతిభతో పవర్ స్టార్‌గా ఎదిగారు. రాజకీయపార్టీని స్థాపించి దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేయాలనే పట్టుదలతో ముందుకు సాగుతున్నారు పవన్. ఆయన క్రేజ్ ఏ పాటిదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వరుస పరాజయాలు వెక్కిరించినా తిరిగి హిట్ కొట్టి టాలీవుడ్‌లో తన స్థానం ఎవరూ అందుకోలేరని ఇప్పటికీ నిరూపిస్తూనే ఉన్నారు. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించినప్పుడు తొలిసారి రాజకీయాల్లోకి ప్రవేశించిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు సొంతంగా జనసేన అనే పార్టీని స్థాపించి ముందుకు సాగుతున్నారు.
అయితే తాజాగా పవన్ ఆస్తులు ఎంత ఉంటాయనే విషయంపై చర్చ నడుస్తుండగా, 2019 ఏపీ ఎన్నికల్లో పోటీ చేసే సమయానికి ప్రభుత్వ లెక్కల ప్రకారం.. తన మొత్తం ఆస్తి రూ.56 కోట్లని తెలిపారు. పవన్‌కి హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ తదితర ప్రాంతాల్లో నివాస గృహాలు, వ్యవసాయ భూములు, వ్యవసాయేతర భూములున్నాయి. ఇక 5 కోట్ల వరకు ఫిక్స్ డ్ డిపాజిట్ చేసినట్టు సమాచారం. ఆయనకి హర్లి డేవిడ్‌సన్ బైకు, స్కార్పియో, మెర్సిడెస్ బెంజ్, స్కోడా టయోటా, వోల్వా వంటి వాహనాలున్నాయి. ఫామ్ హౌజ్‌లకే పవన్ ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టాడని అంటారు.
![Pawan Kalyan Assets : పవన్ కళ్యాణ్ ఆస్తుల విలువ తెలిస్తే ఆశ్చర్యపోవడం ఖాయం..! Pawan Kalyan Assets you will be surprised to know](http://3.0.182.119/wp-content/uploads/2022/10/pawan-kalyan-assets.jpg)
ఇకపోతే పవన్ మూడో భార్య ఆస్తుల విషయానికి వస్తే ఈమె పేరుతో ఏకంగా రూ.1600 కోట్ల పైచిలుకు ఆస్తులు ఉన్నాయట. 2011 నుంచి పవన్ కొన్ని ఆస్తులను ఆమె పేరున కొంటూ వస్తుండగా.. మోడల్ గా ఉన్నప్పుడు మరి కొన్ని ఆస్తులను సంపాదించుకున్నారు. అలాగే అప్పట్లో కొన్న ఆస్తులు ఇప్పుడు విపరీతంగా పెరిగిపోయాయి.