Pawan Kalyan : 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యేగా ప్రజల దృష్టిని ఆకర్షించారు రాపాక.అయితే కొన్నాళ్లు జనసేనలో యాక్టివ్ గా ఉన్న ఆయన తరువాత మెల్లగా అధికార వైసీపీకి దగ్గరవుతూ వచ్చారు. జనసేన కూడా రాపాకను పట్టించుకోకపోవడంతో ఆయన వైసీపీ గూటికి చేరి రాజోలు నియోజిక వర్గ వైసీపీ ఇంచార్జీగా బాద్యతలు చేపట్టారు. ఇక అప్పటి నుండి ఆయన జగన్ పాలనపై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. అయితే ఓ సందర్భంలో ఆయన చేసిన కామెంట్స్ కూడా హాట్ టాపిక్‌గా మారాయి.
తాను దొంగ ఓట్లతో గెలిచానని, రాజోలులో తన గెలుపుకు దొంగ ఒట్లే కారణం అని, తన స్వగ్రామం చింతలమోరి నుంచి 10 నుంచి 20 మంది వచ్చి ఒక్కొక్కరూ ఐదు ఓట్ల చొప్పున దొంగ ఓట్లు వేసేవారని రాపాక ఆ మద్య సంచలన కామెంట్స్ చేశారు. రాపాక వ్యాఖ్యలపై తీవ్ర దుమారమే రేగింది. ఆయన రాజకీయ భవిష్యత్ ప్రశ్రార్ధకంగా కూడా మారింది. అయితే మలికిపురం లో వారాహియాత్ర బహిరంగ సభలో రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ పై పవన్ కళ్యాణ్ మాట్లాడారు. తమ పార్టీ తో గెలిచి ప్రజలకు అవసరమైన పనులు చేయకపోతే ప్రశ్నిస్తానని అన్నారు పవన్ కళ్యాణ్. మా ఓటు బోటు మీద గెలిచి ప్రజలని మోసం చేస్తే వారు సహించరని చెప్పుకొచ్చారు.
![Pawan Kalyan : మలికిపురంలో రాపాక వరప్రసాద్‌కి గట్టిగా ఇచ్చి పడేసిన పవన్ కళ్యాణ్..! Pawan Kalyan angry speech on rapaka](http://3.0.182.119/wp-content/uploads/2023/06/pawan-kalyan-1-6.jpg)
2019 ఎన్నికల ఓటమి మా గుండెకి పెద్ద గాయం చేసింది. ఆ గాయం రాజోలు గెలుపు కాస్త ఉపశమనం ఇచ్చింది. అయితే గెలిచిన ఒక్క ఎమ్మెల్యే కూడా మా నిర్ణయం తీసుకోకుండా వేరే పార్టీకి వెళ్లడం ఎంత వరకు కరెక్ట్. ఇది ప్రజలు అస్సలు సహించరు అని పవన్ అన్నాడు. అంతేకాకుండా తాను పార్టీ పెట్టినప్పుడు 150 మంది సభ్యులు ఉన్నారని చెప్పిన పవన్ ఇప్పుడు ఒక్క రోజులలో పదివేలకి పైగా కార్యకర్తలు ఉన్నారని తెలియజేశాడు. రోజు రోజుకి జనసేన పార్టీ ఎదుగుదల కనిపిస్తుందని ఆయన చెప్పుకొచ్చారు.