Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఈయన అతి తక్కువ సమయంలోనే అశేష ప్రేక్షకాదరణ పొందాడు. చిరంజీవి సోదరుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఆ తర్వత తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం, ఆయన నడవడికని చాలా మంది ఇష్టపడుతుంటారు. పవన్‌కి సామాన్యులే కాకుండా సెలబ్రిటీలు కూడా ఫ్యాన్స్‌గా ఉన్నారు. వారు పవన్‌తో పాటు ఆయన సినిమాలని ఎంతగానో ఇష్టపడుతుంటారు. అయితే ఆర్ఆర్ఆర్ తో పాన్ ఇండియా స్టార్ ఇమేజ్ అందుకున్న ఎన్టీఆర్‌కి పవన్ నటించిన తొలి ప్రేమ సినిమా చాలా ఇష్టమట.. ఆ మధ్య ఓ షోలో ఎన్టీఆర్ ఈ విషయం చెప్పారు.
తొలి ప్రేమ చిత్రాన్ని కరుణాకరణ్ తెరకెక్కించగా, ఈ చిత్రం 1998లో విడుదలైంది. ప్యూర్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ చిత్రంలో కీర్తి రెడ్డి హీరోయిన్‌గా నటించింది. అసలు ఈ సినిమా అప్పట్లో ఓ సెన్సేషన్ క్రియేట్ చేయడమే కాకుండా ఎంతో మంది మనసులని గెలుచుకుంది. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ మనసు కూడా గెలుచుకుంది. ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి మద్దతు ప్రకటించినట్లు , పవన్ సీఎం కావాలని ఆయన కోరుకున్నట్లు ఇటీవల కథనాలు వెలువడిన విషయం తెలిసిందే.
![Pawan Kalyan : పవన్ కళ్యాణ్ నటించిన ఆ సినిమా అంటే ఎన్టీఆర్‌కి చాలా ఇష్టమట..! Pawan Kalyan acted movie Jr NTR likes very much](http://3.0.182.119/wp-content/uploads/2022/10/jr-ntr-pawan-kalyan.jpg)
పవన్ కళ్యాణ్ సీఎం అయితే చూడాలని చిత్ర పరిశ్రమలో చాలా మంది హీరోలు కోరుకుంటున్నారు. ఆయన సీఎం సీటు అధిరోహిస్తే చూడాలని ఆశ పడుతున్నారు. ఉన్నత భావాలు కలిగిన పవన్ కళ్యాణ్ సీఎం గా ప్రజలకు మంచి చేస్తాడని అందరు నమ్ముతుండగా, ఈ క్రమంలో ఎన్టీఆర్ పవన్ కళ్యాణ్ కి తన మద్దతు ప్రకటించినట్లు ఒక వార్త వెలుగులోకి వచ్చింది. పవన్ కళ్యాణ్ సీఎం కావాలని కోరుకుంటున్నానని ఎన్టీఆర్ సన్నిహితులతో అన్నారట. దీనిపై అధికారిక సమాచారం లేకున్నప్పటికీ కొన్ని మీడియా సంస్థలు ఈ వార్తని రిపోర్ట్ చేయడం విశేషం.