Pathala Bhairavi : తెలుగు సినీ ఇండస్ట్రీలో స్వర్గీయ నందమూరి తారక రామారావు గురించి.. ఆయన నటన గురించి.. డైలాగుల గురించి.. సేవాగుణం గురించి .. ఎంత చెప్పిన తక్కువే. ఎన్టీఆర్ కుటుంబ కథా చిత్రాల్లోనే కాకుండా ప్రేమ కథ, పౌరాణిక చిత్రాలతో కూడా ప్రేక్షకులను బాగా అలరించారు. ఎన్నో అద్భుతమైన పౌరాణిక చిత్రాలలో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్న నందమూరి తారక రామారావు నటించిన సూపర్ హిట్ చిత్రాలలో పాతాళభైరవి సినిమా కూడా ఒకటి. 1951 సంవత్సరంలో కె.వి.రెడ్డి దర్శకత్వంలో ఎన్టీ రామారావు, ఎస్.వి.రంగారావు, మాలతి ప్రధానపాత్రలో తెరకెక్కిన ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలోనే విడుదలై మంచి విజయం సాధించింది.
ఈ సినిమా రికార్డ్ విషయానికి వస్తే.. విజయ వాహిని స్టూడియోస్ బ్యానర్ పై బి.నాగిరెడ్డి ఆలూరి చక్రపాణి నిర్మించిన ఈ చిత్రం ఏకంగా థియేటర్లలో 200 రోజులు ఆడి రికార్డు సృష్టించింది. ఈ సినిమాలు ఇప్పుడు టీవీలో వచ్చినా కూడా జనాలు ఎగబడి చూస్తుంటారు. అయితే ఎంత ఎత్తు ఎదిగిన ఒదిగి ఉండే తత్వం ఎన్టీఆర్‌ది. ఎన్టీఆర్ మొదటి నుండి ప్రతి విషయంలోనూ క్రమశిక్షణతో ఉండేవారు. అంతే కాకుండా తాను కష్టపడి సంపాదించిన డబ్బును అవసరం అయితే తప్ప ఖర్చు చేసేవారు. తనది కాని డబ్బు కోసం ఎప్పుడూ ఆశ పడేవారు కాదు.
తనకి స్టార్ స్టేటస్ దక్కిన కూడా ఏ నాడు నిర్మాతలని రెమ్యునరేషన్ విషయంలో ఇబ్బంది పెట్టలేదట. నిర్మాతలకు కూడా గిట్టుబాటు అవ్వాలి కదా అని చెప్పేవారట. తన సినిమాల్లోని నటులు ఎక్కువ పుచ్చుకున్నా కూడా ఎన్టీఆర్ మాత్రం తన కష్టానికి తగ్గ ప్రతిఫలాన్ని మాత్రమే ఆశించేవారు. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ ఎంతో కష్టపడేవారు. ఏకంగా కర్రసామును కూడా నేర్చుకున్నారు. సినిమా షూటింగ్ సమయంలో ప్రతి రోజు ఎన్టీఆర్ కు స్టూడియోలోనే ఇడ్లీలు, వడ టిఫిన్ గా పెట్టేవారట. అంతే కాకుండా నెలకు రూ.250 రూపాయలు రెమ్యునరేషన్ తీసుకునేవారట. అయితే ఆ రోజులలో ఎన్టీఆర్ కాస్త ఎక్కువ రెమ్యునరేషన్ పుచ్చుకున్నాడనే కొందరు చెప్పుకొస్తున్నారు.