Sr NTR : నందమూరి తారక రామారావు.. ఈ పేరుకే ఓ చరిత్ర ఉంది. తెలుగు సినిమా చరిత్రలో తనకంటూ ప్రత్యేకమైన పేజీని లిఖించుకున్న మహానటుడు ఎన్టీఆర్. ఆయన పేరు చెబితే పులకించని తెలుగువాడు లేడనే చెప్పాలి. నటుడిగానే కాదు రాజకీయ నాయకుడిగాను ఎందరో ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న ఎన్టీఆర్ పౌరాణిక, సాంఘీక, జానపద,రాజకీయ చిత్రాలలో నటించిన ఎన్టీఆర్ గొప్ప నటుడిగా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. అప్పటిలో స్టార్ హీరోయిన్స్ సైతం ఎన్టీఆర్ తో కలిసి హీరోయిన్ గా నటించడానికి ఒక్క ఛాన్స్ వస్తే చాలు అని ఎదురు చూసేవారు.
ఎన్టీఆర్ సరసన హీరోయిన్స్ గా సావిత్రి, షావుకార్ జానకి, అంజలిదేవి, కృష్ణ కుమారి, రాజశ్రీ, మంజుల, జయసుధ, జయప్రద, శ్రీదేవిలతో ఎన్టీఆర్ సినిమాలు చేసి వినోదాన్ని పంచారు. ఈ అగ్రస్థాయి హీరోయిన్స్ లో ఒకే ఒక నటి మాత్రం ఎన్టీఆర్ పక్కన మనవరాలిగా మరియు హీరోయిన్ గా నటించింది. ఆమె మరెవరో కాదు అతిలోక సుందరి శ్రీదేవి. 1972వ సంవత్సరంలో చంద్రశేఖర్ రెడ్డి దర్శకత్వంలో ఎన్టీఆర్ బడిపంతులు అనే సినిమాలో నటించాడు. ఈ సినిమాలో ఎన్టీ రామారావు హీరోగా నటించగా అంజలిదేవి హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రంలో కృష్ణంరాజు, రామకృష్ణ, జగ్గయ్య, విజయ లలిత ముఖ్యమైన పాత్రలు పోషించారు. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ మనవరాలిగా శ్రీదేవి నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. అప్పట్లో ఈ సినిమా ఘనవిజయం సాధించింది. ఈ సినిమాతో శ్రీదేవికి బాల నటిగా మంచి గుర్తింపు లభించింది. ఈ సినిమా తరువాత శ్రీదేవి తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ చైల్డ్ ఆర్టిస్ట్ గా అనేక సినిమాలు చేసింది.
ఇక ఇదిలా ఉండగా శ్రీదేవి టాలీవుడ్ లో అనురాగాలు అనే సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత బంగారక్క అనే సినిమాలో కూడా నటించింది. ఆ వెంటనే పదహారేళ్ళ వయసు సినిమాలో నటించి గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇలా వరస సినిమాలు చేస్తున్న శ్రీదేవి 1979లో కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన వేటగాడు సినిమాలో ఎన్టీఆర్ కి జోడిగా హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. కానీ అప్పటిలో వేటగాడు చిత్రంపై ఎన్టీఆర్ మనవరాలి వయసున్న అమ్మాయితో స్టెప్పులు వేయడం ఏంటి అంటూ విమర్శలు కూడా వచ్చాయి.