Navadeep : సెలబ్రిటీలపై పుకార్లు రావడం సహజం. అయితే హీరో నవదీప్ పై గతంలో ఎన్నో రూమన్స్ వచ్చాయి. తాజాగా స్పందించారు. ప్రమోషన్స్ లో భాగంగా నిర్వహించిన ప్రెస్ మీట్ లో అప్పటి రూమర్లకు బదులిచ్చారు నవదీప్…హీరో నవదీప్ – బిందు మాధవి జంటగా న్యూ సెన్స్ తో అలరించబోతున్నారు. తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫారమ్ ‘ఆహా’, ప్రొడక్షన్ హౌస్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మించిన వెబ్ సిరీసే ‘న్యూసెన్స్’. ప్రస్తుతానికి ఈ సిరీస్ కు సంబంధించి సీజన్ 1 మే 12, 2023న ఆహాలో ప్రీమియర్‌ను ప్రదర్శించనుంగా, ప్రమోషన్స్ ను జోరుగా నిర్వహిస్తున్నారు.
ఈ క్రమంలో మీ వల్ల ఓ అమ్మాయి చనిపోయింది? మీరు గేనా? రేవ్ పార్టీ నిర్వహించారా? అని ప్రశ్నించారు. అప్పట్లో వీటిపైనే నవదీప్ ఆరోపణలు ఎదుర్కొన్నారు. తాజాగా వాటిపై క్లారిటీ ఇచ్చారు. నవదీప్ మాట్లాడుతూ.. ‘నా వల్ల ఏ అమ్మాయి చనిపోలేదు. అప్పట్లో 2005లో ఆ ఆరోపణలు వచ్చాయి. వాటిపై ఓ ప్రింట్ మీడియాలో ప్రచురితం కాగా, అవన్నీ అబద్ధం. అలాగే నేను ‘గే’ అనడం అబద్ధమే. అలాగే రేవ్ పార్టీ నిర్వహించామంటూ వచ్చిన రూమర్లు కూడా పూర్తిగా అబద్ధమే. అందుకు మా అమ్మగారే సాక్ష్యం. ఆరోజే మా ఫామ్ లో ఫ్యామిలీ అందరం కలిసి డిన్నర్ చేశాం. ఆ తెల్లరి ఈ వార్త వచ్చింది. మా అమ్మగారు కూడా నన్ను అడిగారు.
నిన్న మనం ఫామ్ కు వెళ్లిన విషయాన్నే రేవ్ పార్టీ అని అంటున్నారని చెప్పారు. అప్పటి నుంచి మా అమ్మ అలాంటి రూమర్లను పట్టించుకోవడం మానేశారు అంటూ నవదీప్ చెప్పుకొచ్చాడు. ఇక తను నటిస్తున్న ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతూ.. మీడియా గురించి ప్రజల మనసుల్లో కొత్త దృక్పథాన్ని సృష్టించే న్యూసెన్స్‌లో భాగమైనందుకు సంతోషంగా ఉందని నవదీప్ అన్నారు. ప్రతి ఒక్కరిలో సానుకూల దృక్పథాన్ని కలిగించే కంటెంట్‌ను అభివృద్ధి చేయడం నటీనటుల బాధ్యత అని బిందు మాధవి పేర్కొన్నారు. దీనిపై ఇద్దరు ధీమా వ్యక్తం చేస్తున్నారు.