Nara Lokesh : యువగళం పేరుతో నారా లోకేష్ పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. శనివారం జిల్లాలోని ముత్తుకూరులో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్న లోకేష్.. మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌లపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. 2019లో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీకి నెల్లూరు జిల్లాలో ఉన్న 10 సీట్లు ప్రజలు ఇచ్చారని, అయితే తిరిగి నెల్లూరు జిల్లాకు వైసీపీ ప్రభుత్వం ఇచ్చిందేమీ లేదని తెలుగుదేశం పార్టీ కీలక నేత నారా లోకేష్ విమర్శలు గుప్పించారు. ‘‘నెల్లూరు జిల్లాని వైసీపీ నేతలు ల్యాండ్, స్యాండ్, వైన్, మైన్, క్రికెట్ బెట్టింగ్ మాఫియాలకు అడ్డాగా మార్చేసారు అంటూ లోకేష్ ఫైర్ అయ్యారు.
హాఫ్ నాలెడ్జ్ సిల్లీ బచ్చా ఇరిగేషన్ మంత్రి అయ్యాడు అంటూ ఆయనని ఇమిటేట్ చేస్తూ విమర్శించారు. అభివృద్ధి మీద చర్చ అనగానే తోకముడిచాడు. సిల్లీ బచ్చా సీటు గల్లంతు అయ్యింది. అందుకే ఫ్రస్ట్రేషన్లో సొంత పార్టీ నాయకుల్ని, ఆఫ్ ది రికార్డ్ జగన్‌ని బండ బూతులు తిడుతున్నాడు. పిల్ల కాలువ తవ్వడం రాని వాడు.. పర్సెంటా, అర పర్సెంటా తొందర ఎందుకన్నా, వెయిటు.. వీ విల్ కంప్లీట్ థిస్ ప్రాజక్ట్ బై 2021 డిసెంబర్ అన్నాడు. ఇప్పుడు ఆ సిల్లీ బచ్చాకే బుల్లెట్ దిగింది’’ అని ఎమ్మెల్యే అనిల్‌ని ఉద్దేశించి లోకేష్ తీవ్రంగా విమర్శించారు. అయితే తనను సిల్లీ బచ్చా అంటున్న నారా లోకేష్ అదే సిల్లీ బచ్చాతో దమ్ముంటే నెల్లూరు సిటీలో పోటీ చేసి గెలవాలని అనిల్ కుమార్ యాదవ్ సవాల్ చేశారు.
తన కుటుంబానికి చరిత్ర లేకున్నా జగన్ అన్న ఆశీస్సులతో మంత్రినయ్యానని, మీ తాత, నాన్న సీఎం లు అయినా ఎమ్మెల్యే కాలేక పోయావంటూ లోకేష్ ను అనిల్ ఎద్దేవా చేశారు. నేనా – సిల్లీ బచ్చా నువ్వా? అని ప్రశ్నించారు. కాగా, పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేశామని గొప్పలు చెబుతున్న వైసీపీ నాయకులు 2023 వచ్చిన కూడా ఇంకా పూర్తి చేయలేదని లోకేష్ పంచ్‌లు వేశారు. కాకాని దొంగ వ్యవసాయ శాఖ మంత్రి అయ్యాడు. ఆయన 8 కేసుల్లో నిందితుడు. రైతుల సమస్యలు పట్టించుకోడు. కల్తీ మద్యం మీద ఆయనకి ఫుల్లు అవగాహన ఉంది అని లోకేష్ అన్నారు.
https://youtube.com/watch?v=p3IVoslT_ZY