Nara Lokesh : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అప్పుడప్పుడు తన మాటల వలన ట్రోలింగ్ బారిన పడుతుంటారు. కొన్ని పదాలు పలకలేకపోవడం వలన ఆయన విమర్శల బారిన పడుతుంటాడు. ఈ క్రమంలో ఆయనని పప్పు అని పిలుస్తుంటారు. గూగుల్ లో ఏపీ పప్పు అని ఇంగ్లిష్ లో టైప్ చేస్తే మంత్రి లోకేష్ బాబు ఫొటోలు వస్తుండటాన్ని భూమన ఓసందర్భంలో ప్రస్తావించారు. మామూలుగా పప్పు అని టైప్ చేస్తే.. కంది పప్పు లేదా మరేదైనా పప్పు ధాన్యం ఫొటోలు రావాల్సింది. అయితే పొలిటికల్ సెటైర్ల నేపథ్యంలో ఇంగ్లిష్ లో పప్పు అని టైప్ చేస్తే.. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఫొటోలు కొన్ని, మంత్రి లోకేష్ ఫొటోలు మరి కొన్ని వస్తున్నాయి.
అదే ఏపీ పప్పు అని ఇంగ్లిష్ లో టైప్ చేస్తే మాత్రం లోకేష్ ఫొటోలే ఎక్కువగా వస్తున్నాయి. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. ఇదే అంశాన్ని భూమన కూడా ప్రస్తావించారు. తాజాగా లోకేష్ అనారోగ్యం అనే పదాన్ని పలకడానికి నానా ఇబ్బందులు పడ్డాడు. చూసి ఆ పదాన్ని అనేందుకు కూడా ఎంతో ఇబ్బంది పడ్డ లోకేష్ ఇప్పుడ తెగ ట్రోల్ అవుతున్నాడు. అతడిని వైసీపీ నాయకులు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. అందుకే నిన్ను పప్పు అనేదని కొందరు చెప్పుకొస్తున్నారు. గతంలో కూడా లోకేష్ తన స్పీచ్‌లో కొన్ని పదాలు పలకలేక విమర్శల బారిన పడడం మనం చూశాం.
టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఈ మధ్య కాలంలో యువత లోకి బలంగా వెళ్ళే విధంగా ప్రయత్నం చేస్తున్నారు. కొన్ని కొన్ని అంశాల్లో లోకేష్ గతంలో తప్పులు ఎక్కువగా చేసిన సరే ఇప్పుడు మాత్రం ఆయన కొన్ని తప్పులను పరిష్కరించుకుని వాటిని మళ్ళీ మళ్ళీ రిపీట్ కాకుండా ప్రయత్నాలు చేస్తున్నారు. పునరావృతం కాకుండా టిడిపి సీనియర్ నాయకులు నుంచి సహకారం కూడా తీసుకుని ముందుకు వెళ్తున్నారు. భవిష్యత్తులో లోకేష్ ఇదే విధంగా ఉంటే మాత్రం తెలుగుదేశం పార్టీ లో చాలా మార్పులు కూడా చోటు చేసుకుంటాయని కొందరు చెప్పుకొస్తున్నారు.