Nani Dasara Movie : నేచురల్ స్టార్ నాని తన కెరీర్‌లో వైవిధ్యమైన పాత్రలు పోషించి మంచి పేరు ప్రఖ్యాతలు అందుకున్నాడు. ఆయన నటించిన తాజా చిత్రం దసరా. ఈ మూవీని పాన్ ఇండియన్ మూవీగా విడుదల చేస్తుండగా ఇతర భాషల్లో కూడా మంచి బిజినెస్ చేసినట్లు సమాచారం హీరో నాని సైతం విజయం మీద చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. పుష్ప, కెజిఎఫ్ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలతో ఈ చిత్రాన్ని పోలుస్తూ తెగ ప్రమోషన్ కార్యక్రమాలు జరుపుతున్నారు. ఇదిలా ఉంటే దసరా చిత్ర కథ ఇదే అంటూ ఓ క్రేజీ రూమర్ తెరపైకి వచ్చింది. నాలుగు పాత్రల చుట్టూ ఈ మూవీ తిరుగుతుంది. ఆ పాత్రల మధ్య ఘర్షణ, భావోద్వేగాలే దసరా కథ అని తెలుస్తుంది.
నాలుగు పాత్ర ఎమోషన్ చుట్టూనే కథ అల్లినట్టు తెలుస్తుండగా, ఇక ఈ పాత్రలు అన్నీ బొగ్గు గనుల్లో పనిచేస్తూంటాయి. హీరో ప్రెండ్ …కీర్తి సురేష్ ని ప్రేమించి పెళ్లి చేసుకోగా, కీర్తి పై కన్నేసిన విలన్ అతన్ని చంపేసి ఆమెను సొంతం చేసుకుందాముకుంటాడు. కానీ అతని క్లోజ్ ప్రెండ్ అయిన నాని ఈ విషయం తెలుసుకుని విలన్ కు బుద్ది చెప్పాలని చూస్తాడు. ఈ క్రమంలోఆమెని పెళ్లి చేసుకుంటాడు. ఇది తట్టుకోలేని విలన్..నానిని అంతమొందించడానికి పన్నాగాలు పన్నుతాడు. నానిపై విలన్ ప్రతీకారం ఎలా తీర్చుకున్నాడనేదే చిత్ర కథగా తెలుస్తుంది. ఇండస్ట్రీలో జరుగుతున్న ప్రచారం ఇది తప్ప ఇందులో ఎంత నిజం ఉందనే దానిపై క్లారిటీ లేదు.
ఈ చిత్రంలో హీరో నాని తన గత చిత్రాలకు పూర్తి భిన్నంగా ఊర మాస్ పాత్రలో కనిపించబోతున్నాడు. సినిమాలో నాని పాత్ర పేరు ధరణి. డీ గ్లామర్ పాత్రలో కనిపించనున్న నాని లుక్ ఇప్పటికే సినిమాపై అంచనాల్ని పెంచేసింది. గోదావరిఖని సింగరేణి కాలరీస్ నేపథ్యంలో సాగే చిత్రంగా రూపొందింది. ఇటీవల విడుదలైన ‘స్పార్క్ ఆఫ్ దసరా’ వీడియోలో కొంత మంది తన వెంట రాగా నాని 90 ఎం.ఎల్ బాటిల్స్ లుంగీకి కట్టుకుని ఊర మాస్ గా కనిపిస్తూ రగులుతున్న బొగ్గులో బీడీని వెలిగించుకుంటూ వస్తాడు. చాలా రా గా ఉన్న నాని లుక్ మాత్రం అభిమానులకి పిచ్చెక్కిస్తుంది.