Nandamuri Kalyan Chakravarthy : సినీ ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీకి ఉన్న గుర్తింపు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారకరామారావు నట వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన బాలయ్య,హరికృష్ణ నటులుగా తమ సత్తా చాటారు. ఆ తర్వాత ఎంతో మంది హీరోలు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. అయితే ఈ కుటుంబం నుంచి వచ్చిన ఓ హీరో గురించి చాలామందికి తెలియదు. సినిమాల్లో నటిస్తున్న అయన ఉన్నట్టుండి సినిమాలకు దూరం అయ్యాడు. 1986లో కోడిరామకృష్ణ దర్శకత్వంలోని స్వాగతం సినిమాలో నటించి తొలిసారిగా ఇండస్ట్రీకి పరిచయమైన నటుడు నందమూరి కళ్యాణ్ చక్రవర్తి.
ఎన్టీఆర్ తమ్ముడైన త్రివిక్రమ్ రావు కొడుకు కళ్యాణ్ చక్రవర్తి కాగా, ఈయన తన తొలి సినిమాతోనే మంచి గుర్తింపు అందుకోగా అదే ఏడాదిలోని వరుసగా రెండు సినిమాలలో నటించాడు. ఇక ఆ తర్వాత ఏడాది వరుసగా నాలుగు సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక 2003లో కబీర్ దాస్ సినిమాలో చివరిసారిగా నటించాడు. ఈ సినిమా తర్వాత మళ్లీ ఏ సినిమాలో కనిపించలేదు కళ్యాణ్ చక్రవర్తి. తొలి చిత్రంగా స్వాగతం అనే సినిమా చేసిన కళ్యాణ్ చక్రవర్తి రెండో సినిమాగా అదే ఏడాది తలంబ్రాలు చేశాడు. రెండు సినిమాలకు వరుసగా కోడి రామకృష్ణ దర్శకత్వం వహించడంతో ఈ నందమూరి హీరో వెనక్కి తిరిగి చూసుకోలేదు.

ముఖ్యంగా ఈయన సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన 1986 సంవత్సరంలోనే 3 సినిమాలు ప్రేక్షకుల ముందుకొచ్చాయి. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ హీరో కు కూడా ఇలాంటి అరుదైన ఘనత దక్కలేదు.1987 సంవత్సరంలో చక్రవర్తి నుంచి నాలుగు సినిమాలు వచ్చాయి. 1988లో రెండు సినిమాల్లో నటించిన తరువాత చక్రవర్తి దాదాపు 15 సంవత్సరాలు గ్యాప్ తీసుకొని 2003లో కబీర్‌దాస్ సినిమాలో కనిపించాడు. మాస్‌కు దగ్గరవ్వాలని ‘రౌడీ బాబాయ్’, ‘రుద్రరూపం’ వంటి యాక్షన్ సినిమాల్లో నటించాడు. అంతేకాదు కళ్యాణ్ చక్రవర్తి ‘భక్త కబీర్‌దాస్’లో శ్రీరాముడిగా నటించాడనే విషయం అతికొద్ది మందికి మాత్రమే తెలుసు. అయితే తన తండ్రి ఆరోగ్యం సరిగ్గా లేని కారణంగా సినిమాలకు దూరమయ్యాడు. ఇటీవల తారకరత్న అంత్యక్రియలలో కనిపించాడు కళ్యాణ్ చక్రవర్తి ప్రస్తుతం చెన్నైలో బిజినెస్ చేస్తూ బిజీగా ఉన్నట్టు తెలుస్తుంది.