Nagababu : ప్రస్తుతం ఏపీ, తెలంగాణ రాజకీయాలు చాలా రసవత్తరంగా ఉన్నాయి. ముఖ్యంగా ఏపీ రాజకీయాలు రోజురోజుకి ఇంట్రెస్టింగ్‌గా మారుతున్నాయి. టీడీపీతో పొత్తు తర్వాత జనసేన నాయకులు కూడా మంచి జోష్‌లో ఉన్నారు. రీసెంట్‌గా నాగబాబు కూడా టీడీపీతో పొత్తుతో పాటు ఇతర విషయాలపై స్పందించారు. చంద్రబాబును ను అరెస్టు చేయడం బాధ కలిగించిందని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు అన్నారు. తిరుపతిలో నిర్వహించిన ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. చంద్రబాబు అరెస్టుపై జనసైనికులు ఆవేదనతో ఉన్నారన్నారు.
టీడీపీ-జనసేన పొత్తును జనసైనికులు స్వాగతిస్తున్నారని, ఎక్కడా అసంతృప్తి లేదన్నారు. ఎవరెవరు ఎక్కడెక్కడ నుంచి పోటీ చేస్తారో త్వరలోనే పవన్ కల్యాణ్ ప్రకటిస్తారని ఆయన తెలిపారు. . జనసేనలోని 90 శాతం మంది చంద్రబాబు పట్ల, పొత్తు పట్ల పాజిటీవ్ గానే ఉన్నారన్నారు. ప్రజాస్వామ్య అందరూ ఒకే నిర్ణయానికి రావాలని లేదని.. ఎంత గొప్పవారు తీసుకున్న నిర్ణయంలోనైనా కొంత వ్యతిరేఖత ఉంటుంది అన్నారు. దాన్ని తాము పరిగణలోకి తీసుకోవటం లేదని.. ఎవరు సీఎం అవ్వాలనే దాని కంటే, పార్టీ ప్రయోజనాల కంటే రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం. ఎవరు సీఎం అనేది కాలం నిర్ణయిస్తుందన్నారు.

తిరుపతిలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారా అనే ప్రశ్నకు కూడా త్వరలో తెలుస్తుందన్నారు. అధికార పార్టీ లో లాగా కోట్ల రూపాయలు వెదజల్లి అక్రమాలతో గెలవాలని యత్నించే నాయకులు తమ పార్టీ కి లేకున్నా రాష్ట్ర భవిష్యత్తు గురించి ప్రజల ఆలోచనలకు అనుగుణంగా పనిచేసే బలమైన కార్యకర్తలు ఉన్నారని, ప్రజలు వారిని గెలిపించుకుంటారని నాగబాబు ధీమా వ్యక్తం చేసారు. త్వరలో రాయలసీమ లో వారాహి యాత్ర ఉంటుందని మరో ప్రశ్నకు జవాబుగా చెప్పారు. ఇక పవన్ కళ్యాణ్‌ని ప్యాకేజ్ స్టార్ అనడంపై మీ అభిప్రాయం ఏంటని అడగగగా,దానికి చెప్పుతో కొడతానంటూ సమాధానం ఇచ్చారు.