మరి కొద్ది రోజులలో ఏపీ తెలంగాణ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. అయితే ఓటర్లని ఆకర్షించేందుకు అనేక పథకాలు అమలు చేయబోతున్నట్టు ప్రకటించారు. అయితే ఈ సారి మళ్లీ తెలంగాణలో అధికారం చేజిక్కించుకునేందుకు కేసీఆర్ కొత్త ఎత్తుగడలు వేస్తున్నారు. తెలంగాణాలో రైతులకు పెన్షన్ పథకం అమలు చేయబోతున్నారా అంటే అవుననే టాక్ వినిపిస్తుంది. బీఆర్ఎస్ వర్గాల సమాచారం ప్రకారం కేసీయార్ ఈ మేరకు వర్కవుట్ చేస్తున్నారట. ఇప్పటికై రైతుల కోసం రైతుబంధు పథకాన్ని వర్తింప చేస్తున్నారు. అలాగే 2018 ఎన్నికల సమయంలో ఇచ్చిన రైతు రుణమాఫీని విడతల వారీగా అమలు చేస్తుండడడం మనం చూస్తూనే ఉన్నాం.
రైతు రుణమాఫీ కేసీఆర్‌కి పెద్ద తలనొప్పిగా మారగా, దీని వలన రాబోవు ఎన్నికలలో సమస్య తలెత్తుతుందేమోనని ముందే భావించిన కేసీఆర్ రైతులకు పెన్షన్ ఇస్తే ఎలాగుంటుందన్న ఆలోచన చేస్తున్నారట. రైతులు, రైతు కుటుంబాల ఓట్లు సుమారుగా కోటికి పైగా ఉంటాయి. వీటిన్నింటిని సాలిడ్ గా వేయించుకోవాలంటే ఏదో ఒక కొత్త పథకాన్ని ప్రకటించాల్సిందే అని కేసీయార్ భావిస్తున్నారట. రైతులకి ఆకర్షించేందుకు కాంగ్రెస్ అనేక హామీలని ఇస్తుంది. దానికి విరుగుడుగా రైతులకు నెలనెలా పెన్షన్ పథకాన్ని ప్రారంభించే విషయమై కేసీయార్ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.
వచ్చే నెల 16వ తేదీన వరంగల్లో బీఆర్ఎస్ నాయకత్వంలో భారీ బహిరంగసభ జరగనుండగా, ఆ సభలో రైతులకు పెన్షన్ పథకానికి ఒక రూపు ఇవ్వాలని కేసీయార్ అనుకున్నారట. అందుకనే రైతు సంఘాలు, వ్యవసాయ రంగంలోని నిపుణులు, ఆర్థికవేత్తలతో ఇప్పటికే చర్చలు మొదలుపెట్టినట్లు పార్టీ వర్గాల టాక్. అయితే కేసీఆర్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఆ తర్వాత పట్టించుకోరు.ఎన్నికల సమయంలో వివిధ వర్గాల ఓట్లకోసం నోటికొచ్చిన హామీలు గుప్పించేస్తారు. అధికారంలోకి రాగానే హామీలను పట్టించుకోరు. రైతు రుణమాఫీ పథకం అమలే దీనికి మంచి ఉదాహరణ. అలాగే ఉద్యోగాల భర్తీకి కూడా ఎన్నో హామీలిచ్చి ఇంతవరకు సక్రమంగా ఒక్కటి అమలుచేయలేదు. మరి రైతు పెన్షన్ పథకం ఏమవుతుందో చూడాలి.