Mudragada : ప్రస్తుతం ఏపీలో రాజకీయం చాలా వాడివేడిగా సాగుతుంది. ఎప్పుడైతే పవన్ వారాహి యాత్ర మొదలు పెట్టారో ఏపీలో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఇటీవల కాకినాడ సభలో ద్వారంపూడిని టార్గెట్ చేస్తూ దారుణమైన వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌కు కాపు ఉద్యమ నేత ముద్రగడ లేఖ రాశారు. తాను స్వార్ధపరుడును.. కోట్లాది రూపాయలకు అమ్ముడు పోవడానికి ఉద్యమం చేయలేదన్నారు. తనకన్నా బలవంతులైన పవన్.. తాను వదిలేసిన కాపు రిజర్వేషన్ల ఉద్యమం ఎందుకు చేయలేదని ప్రశ్నించారు.
ఇటీవల వారాహి యాత్రలో పవన్ కళ్యాణ్ కాపు రిజర్వేషన్‌ల గురించి ప్రస్తావిస్తూ.. రిజర్వేషన్ల కోసం ఉద్యమాలు చేసి రాజకీయంగా ఎదురుగుతున్నారంటూ కామెంట్ చేశారు. దీనికి స్ట్రాంగ్ కౌంటర్‌గా ముద్రగడ జనసేనానికి ఘాటుగా లేఖ రాశారు. తాను కులాన్ని అడ్డుపెట్టుకుని ఎప్పుడు పదవి పొందలేదని.. ఎప్పుడు ఓటమి ఎరుగని తాను కాపు ఉద్యమంతో ఓటమికి దగ్గర అయ్యానన్నారు పద్మనాభం. దీనిని బట్టి తాను కులాన్ని వాడుకున్నానో లేదో తెలుసుకోవాలని హితవు పలికారు. తన కంటే చాలా బలవంతులైన పవన్, తాను వదిలేసిన ఉద్యమాన్ని చేపట్టి.. యువతకు రిజర్వేషన్ ఎందుకు తీసుకురాలేదో చెప్పాలన్నారు. రూ.కోట్ల సూట్‍కేసులకు అమ్ముడుపోవడానికి ఉద్యమం చేయలేదని, జగ్గంపేట సభలో రిజర్వేషన్ అంశం కేంద్రం పరిధిలోనిదని వైఎస్ జగన్ అన్నప్పుడు, తాను ఇచ్చిన సమాధానం ఏంటో అడిగి తెలుసుకోవాలని సూచించారు.
![Mudragada : పవన్‌పై ముద్రగడ సంచలన కామెంట్స్.. వీధి రౌడీ అంటూ ఫైర్.. Mudragada sensational comments on pawan](http://3.0.182.119/wp-content/uploads/2023/06/mudragada-1.jpg)
ఎమ్మెల్యేను తిట్టడానికి విలువైన సమయాన్ని వృధా చేయకండని పవన్‌కి సూచించారు. తాను లేఖ రాసినందుకు ఎక్కడా లేని కోపం రావచ్చని, రాష్ట్రంలో ఉన్న కోట్లాది మంది అభిమానులకు అయితే నన్ను తుది ముట్టించాలనే ప్రయత్నం కూడా చేయవచ్చని అయినా నిజాన్ని నిర్భయంగా రాయాలనిపించి రాయక తప్పలేదని ముద్రగడ పేర్కొన్నారు. ఒకవేళ నిజంగా ప్రజలపై ప్రేమ ఉంటే తనలాంటివారిపై విమర్శలు ఆపి ప్రత్యేక కార్యాచరణ తయారు చేసుకుని రోడ్డు ఎక్కాలన్నారు ముద్రగడ.