OTT : ఇటీవలి కాలంలో థియేటర్స్ కన్నా ఓటీటీ ప్రేక్షకుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతూ పోతుంది. ఈ వారం క్రిస్మస్ వీక్ అవ్వడం వల్ల కూడా ఎక్కువ సినిమాలు రిలీజ్ కు సిద్ధం అయ్యాయి అంటూ బాక్సాఫీస్ వర్గాల వారు అంటున్నారు. ఈ వారం థియేటర్ల ద్వారా తమిళం మరియు తెలుగు లో విశాల్ లాఠీ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కనెక్ట్ సినిమాను కూడా డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు. రవితేజ ధమాకా, నిఖిల్ హీరోగా నటించిన 18 పేజెస్ చిత్రాలు డిసెంబర్ 23న విడుదల అయ్యాయి. మలయాళం మూవీ ‘కాప’ డిసెంబర్ 22వ తారీకున థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకు రాగా, రణ్వీర్ సింగ్ యొక్క సర్కస్ సినిమా కూడా ఈ వారంలో డిసెంబర్ 23వ తారీకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఇక ఓటీటీ సినిమాల విషయానికి వస్తే హిట్ మూవీ మసూదా ను ఆహా వారు డిసెంబర్ 21న స్ట్రీమింగ్ చేయబోతున్నారు. జీ 5 లో ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం ను డిసెంబర్ 23న స్ట్రీమింగ్ చేయబోతున్నారు.అల్లని నరేష్ నటించిన ఈ సినిమా ప్రేక్షకులని అంతంత మాత్రమే అలరించింది. ఇక ఓటీటీలో ఎంతగా అలరిస్తుందో అని అందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ తెలుగు సినిమాలు మాత్రమే కాకుండా ఇతర భాషలకు చెందిన పలు సినిమాలు నెట్ ఫ్లిక్స్.. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఇంకా ప్రైమ్ వీడియో లో స్ట్రిమింగ్ అవ్వబోతున్నాయి. ఎప్పటిలాగే ఈ వారం కూడా థియేటర్ల ద్వారా మరియు ఓటీటీ ద్వారా పెద్ద ఎత్తున ఎంటర్టైన్మెంట్ ను సినిమాలు అందించబోతున్నాయి.
అక్షయ్ కుమార్ రామసేతు చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియాలో స్ట్రిమింగ్ కానుంది. హిందీ, తెలుగు, తమిళ భాషల్లోఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది. ఇక టీచర్ ది టీచర్ అనే చిత్రం నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్ చిత్రం కాగా, ఇది తెలుగు, తమిళం, మలయాళం మరియు కన్నడ భాషల్లో ప్రసారం అవుతోంది. ఇది థ్రిల్లర్‌గా రూపొందింది. గ్లాస్ ఆనియన్: ఎ నైవ్స్ అవుట్ మిస్టరీ నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్ చిత్రం కాగా, డేనియల్ క్రెయిగ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ థ్రిల్లర్ డ్రామా ఎంతో అలరించింది. ఈ చిత్రం కూడా వీకెండ్ లో అలరించబోతుంది.