Movies : తెలుగు సినీ పరిశ్రమ ఉన్నత స్థాయికి చేరుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు తెలుగు సినిమా బాలీవుడ్‌ని సైతం శాసిస్తుంది. ఎన్నో చిత్రాలు హిందీ సినిమాల కన్నా మంచి విజయాలు సాధిస్తున్నాయి. బాహుబలి సిరీస్ తర్వాత రెబల్ స్టార్ ప్రభాస్ పాన్ ఇండియా సెన్సేషన్ అయ్యాడు. ట్రిపుల్ ఆర్ సినిమాతో ఎన్టీఆర్, రామ్ చరణ్ కూడా పాన్ ఇండియా స్టార్స్‌గా మారారు. నిఖిల్ కూడా కార్తికేయ 2 చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్నాడు. అయితే 2022 ఇయర్ ఎండింగ్ కు వచ్చేయగా, నెక్స్ట్ వీక్ అవతార్ 2.. నెల చివరన క్రిస్ మస్ కానుకగా ధమాకా ,18 పేజెస్ సినిమాలు వస్తున్నాయి.
2023 లో భారతీయ సినిమా మీద తెలుగు పరిశ్రమ సత్తా చాటాలని పాన్ ఇండియా సినిమాలు క్యూ కడుతున్నాయి. 2023 లో మన టాలీవుడ్ స్టార్స్ అంతా కూడా పాన్ ఇండియా సినిమాల రేసులో ఉన్నారు. మొదటిగా ఆదిపురుష్ గా ప్రభాస్ వస్తున్నాడు. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా రామాయణ కథతో వస్తుంది. సినిమాను 2023 సమ్మర్ రిలీజ్ ఫిక్స్ చేశారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఈ రేసులో ఉన్నాడు. ప్రస్తుతం పవన్ చేస్తున్న హరి హర వీరమల్లు సినిమా కూడా నేషనల్ వైడ్ గా రిలీజ్ కాబోతుంది. ఇక నెక్స్ట్ ఇయర్ పాన్ ఇండియా రిలీజ్ సినిమాల్లో చరణ్ 15వ సినిమా కూడా ఉండనుంది. శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాతో మరోసారి శంకర్ తన స్టామినా చూపించాలని అనుకుంటున్నాడు.
ఆర్.ఆర్.ఆర్ తర్వాత ఎన్.టి.ఆర్ కొరటాల శివ కాంబో మూవీ ఫిక్స్ కాగా, . ఈ సినిమా కూడా పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. అయితే ఇప్పటివరకు సెట్స్ మీదకు వెళ్లని ఈ సినిమా వచ్చే ఏడాది రిలీజ్ అవడం కొంత డౌట్ అని చెప్పాలి. అల్లు అర్జున్ పుష్ప 2 కూడా మరోసారి ఇండియా లెవల్లో సందడి చేయనుండగా, ఇది కూడా వచ్చే ఏడాది రిలీజ్ కావడం డౌటే. ఇవే కాకుండా నేచురల్ స్టార్ నాని దసరా సినిమా.. అఖిల్ ఏజెంట్.. తేజా సజ్జా హనుమాన్ , ప్రభాస్ సలార్, పవన్ -సుజీత్ చిత్రాలు పాన్ ఇండియా రేంజ్‌లో విడుదల కానుండగా, ఇందులో ఏ మూవీ సత్తా చాటుతుందో చూడాలి.