Manchu Vishnu : మంచు వారబ్బాయి విష్ణు ఇటీవలి కాలంలో తెగ ట్రోలింగ్‌కి గురవుతున్నాడు. ఆయన చేసే సినిమాలు, పెట్టే పోస్ట్‌లు విష్ణుని మరింత నెగెటివ్ చేస్తున్నాయి. అయితే కొద్ది రోజుల క్రితం మంచు బ్రదర్స్ విష్ణు, మనోజ్ మధ్య ఉన్న గొడవల మీడియా ముఖంగా బయటకు వచ్చాయి. అయితే అవన్నీ రియాలిటీ షోలో హౌస్ ఆప్ మంచూస్ రియాలిటీ షోలో భాగమేనని చెబుతూ రెండు రోజుల్లోనే విష్ణు మంచు ఓ టీజర్‌ను విడుదల చేయడంతో అందరూ షాకయ్యారు. ఏంటి మంచు ఫ్యామిలీ కలిసి మీడియాను వెర్రి వాళ్లను చేసిందే! అని అందరు అనుకున్నారు.
మరి కొందరు ఈ టీజర్‌పై అనుమానాలు వ్యక్తం చేసినవాళ్లు కూడా లేకపోలేదు. షో ప్రమోషన్ కోసం చిన్న ఫ్రాంక్ ప్లే చేశామని జనాలను నమ్మించే ప్రయత్నం చేయగా, ఆయన ప్రయత్నం ఫలించిన దాఖలాలు లేవు. పైగా విష్ణు ఇమేజ్ మరింతగా డ్యామేజ్ అయ్యింది. తప్పును కవర్ చేయబోయి దొరికిపోయాడని, పరువుపోగొట్టుకున్నాడన్న వాదనలు వినిపిస్తున్నాయి. హౌస్ ఆఫ్ మంచూస్ ప్రోమోకి మనోజ్ షేర్ చేసిన వీడియో జోడించి విడుదల చేయగా.. దీనిలో జనాలు అనేక లోపాలు వెతకడంతో పాటు కొత్త అనుమానాలు తెరపైకి తెచ్చారు.
ఆ ప్రోమోలో మనోజ్, మంచు లక్ష్మి కనిపించలేదు. ఒక వేళ విష్ణు గొడవపడుతున్న వీడియో ఫ్రాంక్ అయితే దాన్ని ప్రొఫెషనల్ కెమెరాతో షూట్ చేసేవారు. ఇక మనోజ్, మంచు లక్ష్మి ఆల్రెడీ సదరు షోతో మాకు సంబంధం లేదని క్లారిటీ ఇచ్చారు కన్నాంబ కాలం నాటి ట్రిక్ ప్లే చేసి విష్ణు అయితే అడ్డంగా దొరికిపోయాడు. మనోజ్ పెట్టిన రెండు పోస్టులను గమనిస్తే క్లియర్‌గా గొడవ జరిగినట్లు తెలుస్తుంది. అలాగే మోహన్‌బాబుకి సన్నిహితంగా ఉండే చిట్టిబాబు కూడా గొడవ నిజమేనని చెప్పారు. ఆయన కూడా ఈ వీడియోలోనే ఉన్నారు. అంటే గొడవలు వాస్తవం.. హౌస్ ఆఫ్ మంచూస్ వీడియో అబద్దం అని అందరు భావిస్తున్నారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…