Manchu Manoj : మంచు వారబ్బాయి మంచు మనోజ్ రెండో పెళ్లికి సంబంధించి కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో ఎంత చర్చ నడుస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. త్వరలోనే మనోజ్ పెళ్లికి సంబంధించి అధికారిక ప్రకటన వస్తుందని అందరు భావించిన వారు ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే మార్చి 3 అనగా గురువారం రోజు మంచు మనోజ్ అత్యంత సన్నిహితుల మధ్య భూమా మౌనిక తో ఏడడుగులు వేయబోతున్నాడు అంటూ ఓ వార్త ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఇదిలా ఉంటే మోహన్ బాబు ఫ్యామిలీకి భూమా మౌనిక ని రెండో పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదట. దానికి ప్రధాన కారణం మోహన్ బాబు ఎక్కువగా వైసిపి పార్టీకి సపోర్ట్ చేస్తారు.
వీరి పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లన్నీ అక్క మంచు లక్ష్మి ఇంట్లోనే నిర్వహిస్తున్నట్టు టాక్ వినిపిస్తుంది. ఇప్పటికే ఆయా పూజా కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకున్న ఈ కాబోయే జంట.. ప్రస్తుతం పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్ధమయ్యారని అంటున్నారు. పెళ్లి వేడుకల్లో భాగంగా ఈరోజు మెహందీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని సమాచారం. ఇందుకు సంబంధించి మనోజ్ ఫొటో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. వైట్ షర్ట్ లో మనోజ్ పెళ్లి వేడుకలో మెరిసినట్టు కనిపిస్తుంది.
భూమా మౌనిక ఫ్యామిలీ టిడిపి పార్టీ కావడంతో వీరితో వియ్యం అందుకునేందుకు మోహన్ బాబు ఇష్టపడలేదు అని తెలుస్తోంది.మంచు మనోజ్ రెండో పెళ్లి వల్ల మంచు విష్ణుకి, మనోజ్ కి మధ్య గొడవలు జరుగుతున్నాయని,ఈ నేపథ్యంలోనే మంచు మనోజ్ ఇంట్లో నుండి బయటకు వచ్చేసాడు అంటూ ప్రచారాలు కూడా వచ్చాయి. అందువల్లే మోహన్ బాబు ఇంట్లో కాకుండా మంచు మనోజ్ తన పెళ్లిని తన అక్క మంచు లక్ష్మి ఇంట్లో చేసుకుంటున్నాడు అని చెప్పుకొస్తున్నారు. 2019లోనే మనోజ్ తన మొదటి భార్య ప్రణీత రెడ్డికి విడాకులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే మనోజ్ చాలా కాలం తర్వాత సినిమాల్లోనూ బిజీ అవుతున్నారు. రీసెంట్ గా తన నెక్ట్స్ ఫిల్మ్ ‘వాట్ ది ఫిష్’ను అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే.