Manchu Manoj : టాలీవుడ్ కలెక్షన్ కింగ్ మోహన్ బాబు క్రమశిక్షణకి మారు పేరుగా చెబుతుంటారు. ఆయన పేరు చెబితే సినిమా ఇండస్ట్రీకి చెందిన చాలా మంది భయబ్రాంతులకి గురవుతుంటారు. అయితే మోహన్ బాబు తనయులు, టాలీవుడ్ హీరోలు విష్ణు మంచు, మంచు మనోజ్ మధ్య ఇన్నాళ్లు స్తబ్దుగా ఉన్న గొడవలు ఇప్పుడు రోడ్డున పడ్డాయి. మోహన్ బాబు కొడుకులుగా కలిసి మెలిసి ఉండే వీళ్ల మధ్య కొన్నాళ్లుగా దూరంగా పెరిగిందనే చెప్పాలి. రీసెంట్‌గా జరిగిన మంచు మనోజ్ పెళ్లి, మోహన్ బాబు బర్త్ డే వేడుకల్లో ఇది స్పష్టమైంది. అయితే ఇదిప్పుడు గాలివానగా మారింది.
విష్ణు మంచు తన ఇంట్లో పని చేసే సారథి అనే వ్యక్తిపై దాడి చేసే దృశ్యాలకు సంబంధించిన వీడియోను మంచు మనోజ్ ఏకంగా తన ఫేస్ బుక్‌లో పోస్ట్ చేయటంతో ఇప్పుడు ఈ విషయం నెట్టింట చర్చనీయాంశంగా మారింది. మంచు మనోజ్ రెండవ పెళ్లి విషయం నుండి కూడా మంచి విష్ణు అసంతృప్తి గానే ఉన్నాడు అని ప్రచారం జరుగుతుంది. అయితే మోహన్ బాబుకు ఎంతోకాలంగా చాలా సన్నిహితంగా ఉంటున్న సారథి అనే వ్యక్తి మీదనే విష్ణు ఈ విధంగా దాడి చేసినట్లుగా కథనాలు వెలువడుతున్నాయి. అయితే ఈ విషయం మీడియాలో వైరల్ అవుతూ ఉండగా మంచు విష్ణు ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఈ విషయాన్ని ఇంత పెద్దగా చేయాల్సింది కాదు అని మనోజ్ చిన్నవాడు అని స్పందించాల్సిన అంత పెద్ద విషయం కూడా కాదు అని విష్ణు వివరణ అయితే ఇచ్చాడు.
![Manchu Manoj : మంచు మనోజ్- విష్ణు మధ్య గొడవలు.. బయటపడ్డ అసలు విషయం.. వీడియో వైరల్.. Manchu Manoj and manchu vishnu differences viral video](http://3.0.182.119/wp-content/uploads/2023/03/manchu-manoj-and-vishnu.jpg)
ఇక ఇవి ఫ్యామిలీ సర్వసాధారణమని ఇది చాలా చిన్న విషయమే అని మనోజ్ వీడియో పెట్టి ఈ విధంగా వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదని విష్ణు పేర్కొన్నాడు. సారథి అనే వ్యక్తి కారణంగానే ఈ గొడవలు జరుగుతున్నాయనే మాట గట్టిగా వినిపిస్తుంది. మోహన్ బాబుకు సారథి అనే వ్యక్తి తమ్ముడు వరుస అవుతాడు. విష్ణు హీరోగా కెరీర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి తనకు సారథి దగ్గరగా ఉండేవాడు. తర్వాత మోహన్ బాబుకే దగ్గరయ్యాడు. కొన్నాళ్లుగా మంచు మనోజ్‌తో సన్నిహితంగా ఉంటున్నారట. ఈ క్రమంలోనే గొడవలు జరిగినట్టు తెలుస్తుంది. ఈ వివాదంపై మంచు లక్ష్మీ మాట్లాడుతూ.. మనోజ్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ గురించి తనకు తెలియదు అన్నారు. అలాగే ఎలాంటి వీడియోను తాను చూడలేదని అన్నారు. వివాదం గురించి విష్ణు, మనోజ్‌తో నేను మాట్లాడలేదు. ప్రస్తుతం బంధువులతో బిజిగా ఉన్నాను, విషయం తెలిశాక దీని పై మాట్లాడుతాను అని మంచు లక్ష్మీ చెప్పుకొచ్చారు.
This is what #ManchuManoj posted on his #Facebook story
Differences between brothers#VishnuManchu#ManchuFamily#Mohanbabu#LakshmiManchu pic.twitter.com/xDUIJivsiR
— ❤️HONESTU❤️ (@honestuuuu) March 24, 2023