Manasantha Nuvve Child Artist : ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్‌లుగా కనిపించిన వారు ఇప్పుడు పెరిగి పెద్దగై కొందరు హీరోయిన్స్‌గా రాణిస్తుండగా, మరి కొందరు సినిమా పరిశ్రమకు దూరమై పెళ్లి చేసుకున్నారు. అయితే మనసంతా నువ్వే చిత్రంలో నటించిన చిన్నారి మీ అందరికి గుర్తుండే ఉంటుంది. ఆమె పేరు సుహాని కలిత.. 1996లో గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన బాల రామాయణం చిత్రంలో బాలనటిగా తెలుగు తెరకు పరిచయమైంది . ఆ తర్వాత పలు సినిమాల్లో బాల నటిగా కనిపించినా.. 2008లో బి. జయ దర్శకత్వంలో వచ్చిన సవాల్ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. బాలనటిగా సుహాని మనసంతా నువ్వే, ఎలా చెప్పను, ప్రేమంటే ఇదేరా వంటి చిత్రాల్లో నటించిన సుహాని అడపాదడపా పలలు సినిమాలతో సందడి చేస్తుంటుంది.
సుహిని.. సినిమాలతో పాటు పలు కంపెనీల యాడ్స్‌లోనూ నటించింది. 2008లో సవాల్ అనే సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది సుహాని. అయితే హీరోయిన్ గా గుర్తింపు రాలేదు. ఆ తర్వాత పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించిన సుహాని ప్రస్తుతం సినిమాలకి దూరంగా ఉంటుంది. అయితే ఈ అమ్మడు కొన్ని నెలల క్రితం సంగీతకారుడు, మోటివేషనల్ స్పీకర్ విభర్ హసీజాని పెళ్లి చేసుకుంది. సుహాని, విభర్ పెళ్లి చాలా గ్రాండ్‌గా జరగగా, వీరి పెళ్లికి సంబంధించిన ఫొటోలు తెగ హల్‌చల్ చేశాయి.
![Manasantha Nuvve Child Artist : మనసంతా నువ్వే చిన్నారి ఇప్పుడు ఎలా ఉందో చూశారా..? Manasantha Nuvve Child Artist suhani see how is she now](http://3.0.182.119/wp-content/uploads/2022/12/manasantha-nuvve-child-artist-suhani.jpg)
అయితే సుహాని చిన్నప్పుడు ఎలా ఉందో పెద్దగా అయ్యాక కూడా అలానే కనిపిస్తూ అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. సుహాని మనసంతా నువ్వే చిత్రంలో చిన్ననాటి రీమా సేన్ పాత్రలో కనిపించి సందడి చేసింది. అప్పటల్ఓ ఈ చిన్నారి హెయిర్ స్టైల్ చూసి చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు అలాంటి హెయిర్ స్టైల్ చేయించాలని అనుకున్నారు. ఆ సినిమాలో సుహాని చాలా అందంగా కనిపిస్తూనే అద్భుతంగా నటించింది.