దారుణం.. భార్య‌కి దెయ్యం ప‌ట్టింద‌ని క‌డ‌తేర్చిన భ‌ర్త‌..

ఇటీవ‌ల కొన్ని సంఘ‌ట‌న‌లు హృద‌య విదార‌కంగా ఉన్నాయి. క‌ట్టుకున్న భార్య‌తో వందేళ్లు క‌లిసి ఉండాల్సింది పోయి చిన్న చిన్న కార‌ణాలకి క‌డ‌తేర్చారు. ఎన్నో ఆశ‌ల‌తో ఆమె తల్లిదండ్రులు భ‌ర్త ద‌గ్గ‌ర‌కు పంపిస్తే ఆ నమ్మకాన్ని వమ్ముచేసి చివరకు కడతేర్చాడో భర్త. దెయ్యం పట్టిందన్న నెపంవేసి ఇష్టానుసారంగా చావుదెబ్బలు కొట్టి అవయవాలు సైతం దెబ్బతినేలా చేశాడు. నమ్మి కాపురం చేసి ఇద్దరు పిల్లలుకన్న ఆ అభాగ్యురాలు చివరకు ఆ పిల్లల మధ్యే జీవచ్చవంగా పడి ఉండగా ఆమెని ఆసుప‌త్రికి తీసుకెళితే ఆమె చికిత్స పొందుతూ మృతిచెందింది. ఇంతటితో ఆగక అత్తమామల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టి పిల్లలకు ఏదో పడేస్తాలే అని వారి నోర్లు నొక్కే ప్రయత్నం చేశాడు.

ఏపీలోని అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండలం శివకోటి గ్రామంలో విజయ్ కుమార్-మనీషా (25) దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు పిల్లల సంతానం. ఇదిలా ఉంటే.. గత కొంత కాలం నుంచి ఈ దంపతుల మధ్య తరుచు గొడవలు జరుగుతున్నట్లు సమాచారం. ఈ కోపంతోనే భర్త విజయ్ కుమర్ భార్యకు భోజనం కూడా పెట్టకుండా హింసించేవాడట. ఈ క్రమంలోనే మనీషాకు ఇటీవల ఫిట్స్ రావడంతో భర్త దెయ్యం పట్టిందని భార్యను తీవ్రంగా కొట్టడాడు. దీంతో ఆ మహిళ ఇంట్లో పడిపోయింది.

man killed his wife because of she has ghost

అది గ‌మ‌నించిన స్థానికులు ఆ మహిళను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఇక చికిత్స పొందుతూ మనీషా తాజాగా ప్రాణాలు కోల్పోయింది. కూతురు మరణవార్తతో ఆమె తల్లిదండ్రులు గుండెలు పగిలేలా ఏడ్చారు. అనంతరం మృతురాలి తండ్రి.. నా కూతురుని ఆమె భర్త చాలా కాలం నుంచి హింసిస్తున్నాడని, ఇటీవల ఫిట్స్ వస్తే దెయ్యం పట్టిందని కొట్టి చంపాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని రిమాండ్ కు తరలించారు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. శరీరంపై పైకి కనిపించని గాయాలతో కోలుకోలేని స్థితిలోకి వెళ్లిన మనీషా చివరకు మంగళవారం చికిత్స పొందతూ మృతిచెందింది. నిందితునిపై హత్య కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించారు. నిందితున్ని అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago