Mamilla Shailaja Priya : సినిమాలు, సీరియల్స్‌లో నటించినా కూడా రాని గుర్తింపు బిగ్ బాస్ షోతో వచ్చేస్తుంది. ఈ క్రమంలోనే చాలా మంది బిగ్ బాస్ షోలో పాల్గొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. టాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పేరు తెచ్చుకున్న శైలజ ప్రియ బిగ్ బాస్ హౌజ్‌లో అడుగుపెట్టి తెగ సందడి చేసిన విషయం తెలిసిందే. ఈ షోకి రాకముందు శైలజ ప్రియ చాలా సినిమాలలో నటించింది. అందం, అభినయం ఉండి కూడా అనుకున్న స్థాయిలో ఎదగలేకపోయింది. నటిగా శైలజ కెరీర్ 90లలోనే మొదలైంది. జగపతిబాబు, సౌందర్య కాంబినేషన్ లో తెరకెక్కిన దొంగాట.. శైలజ ప్రియ మొదటి చిత్రం.
హీరోయిన్ పీస్ అయినా కూడా ఎక్కువగా సపోర్టింగ్ పాత్రలు పోషించింది. సౌందర్య, రమ్య కృష్ణ వంటి స్టార్ హీరోయిన్స్ కి స్నేహితురాలు పాత్రలు పోషించింది. అయితే ఈ అమ్మడు తన భర్త నుండి విడిపోయి సోలోగా ఉంటుంది. ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో విడిపోయారట. బిగ్ బాస్ హౌజ్‌లో ఈ విషయం తెలియజేసిన ప్రియ.. ఒక్క నిర్ణయం వంద సంవత్సరాల కష్టాన్ని మరిచిపోయేలా చేస్తుందని.. ఆ నిర్ణయం కోసం 18 సంవత్సరాలుగా ఒక మగువ చేసిన అన్వేషణను ఏ విధంగా వర్ణించగలం అంటూ ప్రశ్నించింది.
కట్టుకొనే వాడితో కలిసి ఉండాలనే ఆశ ఉన్నా కూడా కొన్ని కారణాల వలన ఉండలేక పోవడం జరుగుతుంది. ప్రతి సారి అమ్మాయి బాట పూల బాట కాదు. అమ్మాయి కోరుకొన్న జీవితాన్ని చేరుకోవడానికి అన్నిసార్లు సాధ్యపడకపోతే ఊహించని ఓదార్పు అవసరం అంటూ తన జీవితానికి సంబంధించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. 2002 లో కిషోర్ అనే వ్యక్తితో ఈమె పెళ్లి జరగగా, 2003 లో కొడుకు పుట్టాడు. విడిపోయిన దగ్గర నుండి ప్రియ వద్దే కొడుకు ఉంటున్నాడు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…