Mahesh Babu : అమ్మ గారాల పట్టిగా పెరిగిన మహేష్ బాబు ఇప్పుడు తన తల్లి మృతితో చాలా బాధపడుతున్నాడట. చిన్నప్పటిని నుండి ఇందిరా దేవి మహేష్‌ని ఎంతో గారాబంగా పెంచిందట. అమ్మతోపాటే మహేష్ ఎక్కువ రోజులు గడిపాడు. అయితే చివరి రోజుల్లో మహేష్ తల్లి ఇందిరా దేవి ఓ చిన్న కోరికను కోరిందట. సితారని పరికిణీలో చూడాలని అనుకున్న ఆమె ఓణీల ఫంక్షన్ చేయమని కోరిందట. దీంతో మహేష్ ఇప్పుడే ఎందుకులే అన్నట్టు కొట్టి పడేశాడట. ఆమె చనిపోయాక ఆ విషయం తలచుకొని చాలా బాధపడ్డాడట మహేష్ బాబు. అంతేకాదు సితార కూడా ఈ విషయంలోనే కుమిలి కుమిలి ఏడ్చినట్టు సమాచారం.
ఇటీవల సితార ఏడుస్తున్న దృశ్యాలు కూడా చాలా వైరల్ అయ్యాయి. సితారకు కూడా ఆమె నాన్నమ్మ అంటే చాలా ఇష్టం. హాలీడేస్ టైంలో నాన్నమ్మ దగ్గరకు వెళ్లి సరదాగా గడిపి వస్తుంటారు. ఇప్పుడు తన నాన్నమ్మ లేదని తెలిసి గౌతమ్, సితార కన్నీరు మున్నీరుగా విలపించారు. ఇక ఇందిరా దేవికి ముసలిమడుగులో ఇప్పటికీ ఇల్లు ఉందని అక్కడ ఉండే జనాలు చెప్పుకొచ్చారు. కాగా ఇందిరా దేవి చాలా సైలెంట్ గా ఉండే వారని ఎవరితో ఎక్కువగా మాట్లాడరని.. కానీ మన అనుకుంటే ఆమె చాలా ఆప్యాయంగా చూసుకుంటారని కూడా వారు అన్నారు.
కృష్ణ విజయ నిర్మలను చేసుకున్న సమయంలో ఇందిరాదేవి చాలా కాలం పాటు అంగీకరించలేదట. ఆ తర్వాత మెల్లిమెల్లిగా అంతా సర్దుకుపోయింది. ఇందిరా దేవి కృష్ణను పెళ్లి చేసుకొని పిల్లల్ని కన్నాక రమేష్ బాబు, మహేష్ బాబులతో తరచుగా తన ఊరు ముసలిమడుగు వెళ్లి వచ్చేదని అక్కడి స్థానికులు చెబుతున్నారు. ఇందిరా దేవి మరణాన్ని వారు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ఇందిరా మృతికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపిన విషయం తెలిసిందే.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…