Mahesh Anand : మహేష్ ఆనంద్.. ఈ పేరుతో తెలుగు ప్రేక్షకులకు చాలా సుపరిచితం. చాలా సినిమాలలో విలన్‌గా కనిపించి మెప్పించారు. ఒక్కసారి 90ల్లోకి వెళ్లి సూపర్ స్టార్ కృష్ణ నటించిన నెంబర్ వన్ సినిమాతో పాటు బాలయ్య టాప్ హీరో సినిమాలు గుర్తు చేసుకుంటే అందులో ప్రతినాయకుడిగా కనిపించింది ఈ మహేష్. 90వ దశకంలో ఈయన వందల సినిమాల్లో నటించాడు. చివరికి దిక్కులేని వాడిలా పాపం అనుమానాస్పదంగా కన్నుమూసాడు. తన ఇంట్లోనే రెండు రోజుల తర్వాత ఈయన శవాన్ని కనుక్కొన్నారు. మహేష్ మృతికి కారణాలు ఇప్పటి వరకు తెలియరాలేదు.
తెలుగు కంటే హిందీలో ఈయన ఇంకా పాపులర్. అక్కడ చాలా సినిమాల్లో విలన్‌గా నటించాడు . చివరగా ఈయన గోవిందా ‘రంగీలా రాజా’ సినిమాలో నటించాడు మహేష్. బాలీవుడ్‌లో వచ్చిన ‘కురుక్షేత్ర, స్వరాజ్, కూలీ నెంబర్ 1, విజేత లాంటి ఎన్నో సినిమాల్లో నటించాడు మహేష్ ఆనంద్. లంకేశ్వరుడు సినిమాతో మహేశ్ ఆనంద్ టాలీవుడ్ కు పరిచయం కాగా, ఆ తరవాత అల్లుడా మజాకా సినిమా విలన్ గా నటించి అదరగొట్టాడు. మహేశ్ ఆనంద్ ముంబైలో జన్మించగా, ఆయన చిన్నతనంలోనే కరాటే నేర్చుకున్నాడు. ఆ తరవాత సొంతంగా మార్షల్ ఆర్ట్స్ స్కూల్ ను నడిపించాడు. మహేశ్ ఆనంద్ కు డ్యాన్స్ అన్నా కూడా చాలా ఇష్టం.
డ్యాన్స్ నేర్చుకుని డ్యాన్స్ స్కూల్ కూడా పెట్టాడు. ఓ నిర్మాత మహేశ్ ఆనంద్ మార్షల్ ఆర్ట్స్ స్కూల్ లో తనకుమారుడిని చేర్చించడానికి వెళ్లినప్పుడు అతడిని చూసి ఇతను సినిమాలకి పనికొస్తాడని భావించి పలువురు దర్శకలకి చెప్పడంతో అవకాశాలు అందుకున్నారు . అయితే సినిమాల్లో రానిస్తున్న సమయంలోనే నటి రీనారాయ్ సోదరి బర్కారాయ్ ని పెళ్లి చేసుకున్నాడు. రెండేళ్లకే వీరిద్దరూ విడాకులు తీసుకోగా, ఆ ఆరువాత వరుసగా 5 పెళ్లిళ్లు చేసుకున్నాడు. ఇలా మొత్తం ఐదుగురిని పెళ్లి చేసుకున్నాడు. ఐదో భార్య ఉషతో ఎక్కువ కాలం ఉన్నాడు. మహేశ్ ఆనంద్ తాగుడుకు బానిస కావడంతో సినిమాల అవకాశాలు తగ్గాయి. ఐదో భార్య కూడా మహేశ్ ను విడిచి వెళ్లిపోయింది. ఆ తరవాత మహేశ్ డిప్రెషన్ లోకి వెళ్లి 2018లో తన ఫ్లాట్ లో దిక్కులేని స్థితిలో మరణించాడు.