Kaikala Satyanarayana : జనం మెచ్చిన నటుడు, నవరస నట సార్వభౌముడు కైకాల సత్యనారాయణ డిసెంబర్ 23 తెల్లవారుఝామున వయోభారం కారణంగా కన్నుమూసారు. నవరస నట సార్వభౌమునిగా ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న కైకాల అనేక అవార్డులు అందుకున్నారు. తెలుగు ప్రజలు గర్వించదగ్గ విలక్షణ నటుడిగా, లోక్ సభ సభ్యునిగా దివంగత కైకాల సత్యనారాయణ చేసిన కళాసేవ, ప్రజా సేవ గొప్పదని ప్రతి ఒక్కరు కొనియాడుతున్నారు. కైకాల సత్యనారాణ నటించిన పాత్రలు లేవు.. భావోద్వేగ పాత్రల్లో నటిస్తే కన్నీళ్లు తెప్పించేవారు. ఏనాడూ వివాదాల జోలికి వెళ్లకుండా అందరితో స్నేహంగా ఉండేవారు. ఆయన అజాత శత్రువు.
60 ఏళ్ల సుదీర్ఘ సినీ ప్రస్థానంలో కైకాల చేయని పాత్ర లేదు, వేయని వేషం లేదు. హీరో, విలన్, కమెడియన్, క్యారెక్టర్ రోల్స్… అన్ని పార్శ్వాలు ఉన్న పాత్రలు చేసి విలక్షణ నటుడిగా అందరి మనసులలో చెరగని ముద్ర వేసుకున్నారు. అయితే ఈ లెజెండరీ యాక్టర్ ఒక కాంబినేషన్ కోరుకున్నారట. అది సాకారమైతే ఆ చిత్రంలో నటించాలని ఎంతగానో అనుకున్నారట. ఆ కాలంలో ఎన్టీఆర్ – కృష్ణ కలిసి దేవుడు చేసిన మనుషులు చిత్రంలో నటించగా అందులో సత్యనారాయణ ఓ కీలక పాత్ర పోషించి మెప్పించాడు. 1973లో విడుదలైన దేవుడు చేసిన మనుషులు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.
తర్వాతి తరం స్టార్ హీరోలు అయిన బాలకృష్ణ – చిరంజీవి మల్టీ స్టారర్ చేస్తే అందులో నటించాలని కైకాల ఎంతగానో అనుకున్నారట. ఆయన కోరిక తీరలేదు. కొందరు ప్రయత్నం చేసినా ఈ కాంబో సెట్ కాలేదు. అయితే ఎన్టీఆర్-రామ్ చరణ్ కలిసి నటించడాన్ని ఆయన ఆస్వాదించారట. ఆర్ ఆర్ ఆర్ మూవీ చూసి చాలా సంతోషం వ్యక్తం చేశారట. ఏదేమైన తెలుగు సినిమా పరిశ్రమలో చెరగని ముద్ర వేసుకున్న సత్యనారాయణ కన్నుమూయడం ప్రతి ఒక్కరిని ఎంతగానో బాధిస్తుంది.