Magadheera Movie : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సూపర్ హిట్ చిత్ర్రాలలో మగధీర కూడా ఒకటి. ఈ చిత్రం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కగా, ఈ మూవీ ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈసినిమాతో రాజమౌళి, రామ్ చరణ్ క్రేజ్ అమాంతం పెరిగింది. ఈ సినిమా దెబ్బతో చరణ్ వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన అవసరం కూడా రాలేదు. రామ్ చరణ్ తొలి చిత్రం చిరుత కాగా, ఈ సినిమా విడుదలైన నాలుగేళ్లకు మగధీర విడుదలై పెద్ద విజయం సాధించింది. అయితే ఈ సినిమాకి సంబంధించిన ఆసక్తికర విషయం ఇప్పుడు ఒకటి నెట్టింట హల్చల్ చేస్తుంది.
మగధీర సినిమా రిలీజ్ ముందు సినిమా వాళ్లకి ప్రివ్యూ వేసారట. అయితే తన కుమారుడి సినిమా ఎలా ఉంటుందో చూద్దామని చిరు ఆయన సతీమణి సురేఖ ఓ థియేటర్ లో ప్రివ్యూ షోకు వెళ్లారట. సినిమా చూస్తున్నంత సేపు కూడా ఆ విజువల్స్ తన ఊహకే అందనివిధంగా ఉన్నాయని సినిమా ఆద్యంతం ఉత్కంఠగా సాగిందని చెప్పారు. సినిమా చూసి సురేఖ ఒకింత ఆనందం, సంతోషం అన్ని ఇలా బయటకు వచ్చాయట. అయితే ఆ సమయంలో తన కుమారుడికి ఓ హగ్ ఇవ్వాలని సురేఖ భావించగా, కుదురలేదు. ఆ సమయంలో రామ్ చరణ్ వేరే థియేటర్ లో సినిమా చూస్తున్నాడు. అయితే వెండితెరపై తమ కుమారుడి స్టంట్స్, యాక్షన్ చూసి ఇద్దరు తెగ సంబరపడ్డారంట.
![Magadheera Movie : మగధీర సినిమా రిలీజ్ ముందు సురేఖ వలన చిరు అన్ని ఇబ్బందులు పడ్డాడా..! Magadheera Movie what happened before release in Chiranjeevi house](http://3.0.182.119/wp-content/uploads/2022/10/magadheera-movie.jpg)
ఇక ఫస్ట్ షో ముగించుకుని ఇంటికి వచ్చాక రాత్రి 9.40 అయిందట. దాదాపు అరగంట పాటు ఆ సినిమా గురించే చర్చించిన తరువాత మళ్లీ సినిమాకి వెళదాం అని సురేఖ అన్నదంట. ఇన్నేళ్ల నా జీవితంలో కనీసం నా సినిమాను కూడా ఎప్పుడు రెండవ సారి చూడాలని అడగలేదు. ఎంతైనా నా కంటే నీ కొడుకు ముద్దు అని చిరు సరదగా అని సురేఖని మరో థియేటర్‌కి తీసుకెళ్లాడట. ఇంటర్వెల్ టైం నుంచి ఆ షో చూసి అక్కడే ఉన్న చరణ్ ను ముద్దాడి ఎంతో ఆనందపడ్డారట. సినిమా చూసి ఇంటికి వచ్చే సరికి 1గంట అయిందట..ఆ రోజంతా ఇంట్లో సినిమా గురించే చర్చనడిచిందని, రాత్రి నిద్ర కూడా పోలేదని చిరంజీవి ఓ సందర్బంలో చెప్పుకొచ్చారు.