Krishna Mahesh Babu : సినిమా పరిశ్రమలో తండ్రికి తగ్గ తనయుడు అని నిరూపించుకున్న వారు కొందరే ఉండగా, అందులో మహేష్ బాబు ఒకరు. ఆయన అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చి సూపర్ స్టార్ అయ్యారు. ఆయన గతంలో తండ్రి కృష్ణతో కలిసి పలు సినిమాలు చేశారు. అంతేకాదు ఆయన చేసిన సినిమా కథతో ఓ సినిమా చేసి మంచి విజయం అంది పుచ్చుకున్నారు. ఒకే టైటిల్ తో తండ్రీ కొడుకులు సినిమాలు చేసిన సంఘనలు చాలా ఉన్నాయి. కానీ ఒక కథతో తండ్రీ కొడుకులు సినిమాలు చేసింది మన టాలీవుడ్ లోనే జరిగింది. మహేశ్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన శ్రీమంతుడు సినిమా ప్రేక్షకులకు తెగ నచ్చేసింది.
ఈ సినిమాకలెక్షన్ల సునామి సృష్టించింది.. ఇందులో మహేశ్ బాబు తండ్రి ఊరిని విడిచి పట్నంలో స్థిరపడి వేల కోట్ల ఆస్తులను సంపాదిస్తాడు. దాంతో మహేశ్ బాబు పట్నంలోనే పెరుగుతాడు. కానీ మనసంతా తన సొంత ఊరిపైనే ఉంటుంది. దాంతో పెద్దవాడయ్యాక సైకిల్ వేసుకుని ఊరికి బయలుదేరి, అక్కడ పరిస్థితులని చూశాక ఊరిని దత్తత తీసుకుని బాగుచేయడం మొదలు పెడతాడు. ఈ క్రమంలో ఎంపీ సోదరులు చేసే అక్రమాలను ఎదిరించి పోరాటం కూడా చేస్తాడు. అక్కడే శృతిహాసన్ తో ప్రేమాయణం కూడా ఉంటుంది.
ఈ సినిమా తర్వాత చాలా మంది కొన్ని ఊర్లని దత్తత తీసుకున్నారు. అయితే ఇలాంటి కథతోనే మహేశ్ బాబు తండ్రి సూపర్ స్టార్ కృష్ణ కూడా ఓ సినిమా చేశారు..కృష్ణ హీరోగా శ్రీదేవి హీరోయిన్ గా రామరాజ్యంలో భీమరాజు అనే సినిమా వచ్చింది. సినిమాలోని ఓ గ్రామంలో రామరాజు అనే వ్యక్తి ఊరిపెద్దగా వ్యవహరిస్తూ అక్రమాలకు పాల్పడుతూ ప్రజలను పీడిస్తూ ఉంటాడు. ఇక అదే గ్రామంలోకి భీమరాజు (కృష్ణ) అడుగుపెడతాడు. రామరాజును ఎదిరిస్తూ ప్రజలను రక్షిస్తుంటాడు.
హీరోయిన్ తండ్రి ఇంట్లో పనిచేస్తూ భీమరాజు ఆమెతోనే ప్రేమాయణం కొనసాగిస్తాడు. క్లైమాక్స్ లో హీరోయిన్ తండ్రి మరో వ్యక్తితో ఆమెను పెళ్లికి సిద్దం చేయగా భీమరాజు తండ్రి వచ్చి నా కొడుకు కోట్ల రూపాయలకు అధిపతి , అయినప్పటికీ అవన్నీ కాదనుకుని ఇక్కడకు వచ్చాడని చెప్పడంతో అంతా అవాక్కవుతారు. ఇది కూడా మంచి విజయం సాధించింది. ఇక ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అలా తండ్రీ కొడుకులు ఒకే కథతో వచ్చి బాక్స్ ఆఫీస్ ను షేక్ చేయడం టాలీవుడ్ లో తొలిసారి అని అంటున్నారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…