Kodali Nani : ఈ సారి వైసీపీని అధికారంలోకి తెచ్చేందుకు జగన్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. తన పార్టీకి సంబంధించి జోరుగా ప్రచారాలు చేస్తున్నారు.అయితే ఇటీవల సీఎం వైఎస్ జగన్ మీద జరిగిన దాడి ఏపీలో రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. అధికార, ప్రతిపక్షాలు దీనిపై మాటల యుద్ధానికి దిగుతున్నాయి. ఈ క్రమంలోనే సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద జరిగిన రాళ్లదాడిపై మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు జగన్ మీద పక్కా ప్లాన్ ప్రకారం దాడి జరిగిందని కొడాలి నాని ఆరోపించారు. “జగన్ మీద జరిగింది రాయి దాడి కాదు. చాలా పకడ్బందీగా వ్యూహం ప్రకారం, గురిచూసి కొట్టాలని చూశారు. సీఎం జగన్ కదలడం వలన గురి తప్పి కన్ను వద్ద తగిలింది. దేవుడు దీవెనలు, ప్రజల ఆశీస్సులతోనే సీఎం జగన్ గాయంతో బయటపడ్డారు.
అయితే దానిని ఖండించాల్సిన పెద్దలు.. సంస్కారహీనంగా జగనే దాడి చేయించుకున్నారని మాట్లాడుతున్నారు. జగన్‌ను రాజకీయంగా ఎదుర్కోలేక ఇలాంటివి చేస్తున్నారు. దేశంలోని పది సంస్థలు సర్వే చేస్తే 9 సంస్థల సర్వేల్లో 125 అసెంబ్లీ స్థానాలు, 20 పార్లమెంటు స్థానాలు వస్తాయని చెప్తున్నాయి. అందుకే రాజకీయంగా జగన్‌ను ఎదుర్కోలేని రాజకీయ నిరుద్యోగులు, విజయవాడలో అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టడం ఓర్చుకోలేని వర్గాలు జగన్ మీద దాడి చేశాయి” అని కొడాలి నాని ఆరోపించారు.
ముఖ్యమంత్రి జగన్ పై దాడి వెనక అనేక మంది పెద్దలున్నారని ఆయన అన్నారు. తుళ్లూరులో చంద్రబాబు జగన్ తో రాళ్లకొట్టాలని పిలుపునిచ్చారని, ఆ తర్వాత ఈ ఘటన జరిగిందని అన్నారు. పచ్చ దండు కులన్మోదంతో ముదిరిపోయిన పిచ్చి పరాకాష్టకు ఎక్కించుకున్న ఉన్మాదులు ఈ దాడికి పాల్పడ్డారన్నారు. పకడ్బందీ పక్కా ప్రణాళికతోనే ఈ దాడి జరిగిందన్నారు. దాడి చేసిన వారిపైన, దాడి వెనక ఉన్న వారిపై కూడా కఠినంగా శిక్షించాలని కొడాలి నాని డిమాండ్ చేశారు. గురి చూసి గన్ తోనే కొట్టారని అన్నారు. వీడియోలు నా వద్ద ఉన్నాయి. చంద్రబాబు మాటలు విని కొంతమంది జగన్‌ను చంపడానికి ప్రయత్నించారు. ఎంత వేగంగా వస్తే జగన్‍కు తగిలి మళ్లీ వెల్లంపల్లికి రాయి తగిలి అతనికి కూడా గాయమవుతుందా?. కరెంట్ తీసేశారని టీడీపీ వాళ్లు అంటున్నారు. ప్రధాని, సీఎం స్థాయి వ్యక్తులు ర్యాలీగా వెళ్తున్నప్పుడు కరెంట్ తీయడం సహజం. వైర్లు తగిలి ప్రమాదం జరుగుతుందని కరెంట్ తీసేస్తారు. ఇది టీడీపీ వాళ్లకు తెలియదా? చంద్రబాబు ప్రేరణతోనే గత ఎన్నికలప్పుడు దాడి జరిగింది. ఇప్పుడు జరిగింది”అని కొడాలి నాని ఆరోపించారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…