Kodali Nani : మరికొద్ది రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలకు ఇప్పటి నుంచే ప్రధాన రాజకీయ పార్టీలు సన్నాహాలు చేస్తున్నాయి. ఇప్పటికే వైసీపీ నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహిస్తూ గెలుపు గుర్రాలకు నియోజకవర్గ ఇన్చార్జిలుగా బాధ్యతలు అప్పగిస్తూ ఉండడం మనం చూస్తూనే ఉన్నాం. మరోవైపు చంద్రబాబు కూడా ఎన్నికలకు సంబంధించిన వ్యూహాలను రచిస్తూ క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేస్తూ పని మొదలుపెట్టారు. అయితే తాజాగా కొడాలి నాని చంద్రబాబుపై తనదైన శైలిలో పంచ్‌లు వేసి అందరిని నవ్వించారు.
ఏపీలో చంద్రబాబు ఔట్‌డేటెడ్ పొలిటీషియన్ అని, ఎంతమంది వ్యూహకర్తలు వచ్చి ప్రచారాలు చేసినా వైఎస్ జగన్‌ను విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరని పేర్కొన్నారు. ప్రశాంత్ కిషోర్ సూచనలతోనే బాబాయ్ వైఎస్ వివేక్‌ను చంపారని, జగన్ కోడి కత్తి డ్రామాలు ఆడుతున్నారని విమర్శించిన చంద్రబాబు మళ్లీ పీకేతో జతకట్టడం రాజకీయ అనైతికతకు నిదర్శమని ఆరోపించారు.గత ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ మేధస్సునంతా వాడుకున్నామని, ప్రస్తుతం ఆయన దగ్గర ఏమి లేదని వ్యాఖ్యానించారు. ప్రశాంతి కిషోర్ కు, ఐప్యాక్ కు సంబంధం లేదని స్పష్టం చేశారు. ఇండియా కూటమిలో చేరమని సీఎం మమతా బెనర్జీ పంపితే ప్రశాంత్ కిషోర్ ఏపీకి వచ్చి చంద్రబాబుతో కలిసారని వెల్లడించారు.
ఇక ఇదిలా ఉంటే చంద్రబాబుపై నిత్యం తీవ్ర వ్యాఖ్యలు చేసే కొడాలి నానిని టార్గెట్ చేస్తున్న తెలుగుదేశం పార్టీ అక్కడ కొడాలి నాని ని ఓడించాలని పక్కా ప్లాన్ తో ముందుకు వెళుతున్నారు. అక్కడ ఈసారి కొడాలి నాని కి చెక్ పెట్టే ప్లాన్ మొదలు పెట్టింది. అయితే గత ఎన్నికలలో చేసిన తప్పులు ఈసారి పునరావృతం కాకుండా గట్టి చర్యలు తీసుకుంటున్నారు.ముందు తెలుగుదేశం పార్టీని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేస్తే ఆపై ప్రత్యర్ధిని గట్టిగా టార్గెట్ చెయ్యొచ్చు అని భావించిన టీడీపీ అధినేత అందుకు వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నారు. చూడాలి మరి రానున్న రోజులలో ఎలాంటి ఘటనలు చోటు చేసుకుంటాయో మరి.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…