KCR : ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం హవా నడుస్తుంది. బీఆర్ఎస్ నాయకులని దారుణంగా విమర్శలు చేస్తూ వారు గతంలో చేసిన అక్రమాలని బయటకు తీస్తున్నారు.ఇక ప్రస్తుతం అసెంబ్లీ నడుస్తుండగా, అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి చేసిన కామెంట్స్‌పై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. విద్యుత్ సంస్కరణల పేరుతో అప్పనంగా ప్రభుత్వం సొమ్మును దొచుకున్నారని అటెండర్ ఉద్యోగాన్ని కూడా తమ వాళ్లకే ఇచ్చుకొని విద్యుత్ శాఖనే సర్వనాశనం చేశారని ఆరోపించారు.
రాష్ట్రంలో విద్యుత్ వెలుగులకు కేసీఆర్ పాలన కారణం కాదని.. అంత కంటే ముందు సోనియా గాంధీ, జైపాల్‌రెడ్డి చొరవతోనే తెలంగాణ విద్యుత్ కొరత తీరిందని చెప్పారు. ఇదే విషయాన్ని తాను టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే సభ దృష్టికి తీసుకొచ్చారని అన్నారు. అప్పట్లో తాను నిజాలు మాట్లాడితే తనను మార్షల్స్‌తో బయటకు నెట్టేశారని అన్నారు. ఇప్పుడు విద్యుత్ గురించి చెబుతున్న వారంతా రాష్ట్రానికి చేసిందేమీ లేదని అన్నారు. బడ్జెట్‌పై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ నేతలు తీవ్ర స్థాయిలో ఖండించారు. అయితే అధికార పక్షాన్ని ఇరుకున పెట్టేలా కామెంట్స్ చేయాలని కేసీఆర్ తమ నాయకులకి దిశా నిర్ధేశం చేస్తున్నారు.
ఇటీవల ఎర్రవల్లి ఫామ్ హౌజ్‌లో జరిగిన ఈ సమావేశంలో.. ప్రభుత్వం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ మీద అసెంబ్లీలో చేపట్చనున్న చర్చ సందర్భంగా.. అనుసరించాల్సిన వ్యూహాలను పార్టీ శ్రేణులకు కేసీఆర్ దిశానిర్దేశం చేసినట్టు సమాచారం. అధికార పార్టీని అసెంబ్లీ వేదికగానే ఇరుకున పెట్టాలని నేతలకు కేసీఆర్ సూచించినట్టు సమాచారం. ఏ అంశం లేవనెత్తినా.. ఎలా కార్నర్ చేయాలి.. ప్రభుత్వ విమర్శలకు ఎలా కౌంటర్ ఇవ్వాలన్న అంశాలపై దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తోంది. మరోవైపు.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు మేడిగడ్డ పర్యటనకు వెళ్లగా.. అందుకు సంబంధించిన అంశాలపైన కూడా కేసీఆర్ ఆరా తీసినట్టు తెలుస్తోంది. వచ్చే ప్రభుత్వం మనదే. అందులో ఎలాంటి ఆశ్చర్యం లేదు. రేవంత్ రెడ్డి ఎలా ఆపుతాడో చూస్తానంటూ కేసీఆర్ తమ నాయకుల దగ్గర కామెంట్ చేసినట్టు తెలుస్తుంది.