Anchor Sowmya Rao : జబర్దస్త్ షోకు, ఆ షోలో వచ్చే యాంకర్లకి ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రష్మీ, అనసూయకి అయితే విపరీతమైన క్రేజ్ దక్కింది. ఇక యాంకర్ సౌమ్య రావు కూడా జబర్ధస్త్ షోతో తెలుగు ప్రేక్షకులకి దగ్గరైంది. ఆది, సౌమ్యల ట్రాక్ కూడా బాగానే క్లిక్ అయింది. సుధీర్ రష్మీలకు చేసినట్టుగానే ఆది సౌమ్యలకు కూడా స్పెషల్ ఈవెంట్లు చేశారు. శ్రీదేవీ డ్రామా కంపెనీలోనూ ఈ ఇద్దరూ సందడి చేశారు. జబర్దస్త్ యాంకర్‌గా సౌమ్య బాగానే క్రేజ్ దక్కించుకుంది. తెలుగు రాకాపోయినా కూడా షోను అలా అలా ముందుకు నడిపించుకుంటూపోయింది.అంతా బాగానే ఉందనకున్న టైంలో యాంకర్‌గా సౌమ్యను తప్పించేశారు.
అయితే జబర్ధస్త్ నుండి సౌమ్యనే వెళ్లిపోయిందో తెలియదు. ఆమె స్థానంలోకి బిగ్ బాస్ బ్యూటీ సిరిని తీసుకొచ్చి పెట్టారు. ఈ మార్పు వెనుక ఎవరున్నారు? మల్లెమాల టీం ఈ నిర్ణయం తీసుకుందా? జబర్దస్త్ డైరెక్షన్ టీం తీసుకుందా? లోలోపల ఏమైనా గూడుపుఠాణి జరిగిందా? అనేది ఇప్పటికీ సస్పెన్స్‌గానే మారింది. అయితే పలు సందర్భాలలో సౌమ్య వాటిపై స్పందిస్తూ ఉంటుంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సౌమ్య స్టన్నింగ్ కామెంట్స్ చేసింది. అగ్రిమెంట్ అయిపోవడంతో కొత్త ఫేస్ చూసుకుంటా అని అన్నారు. నేను ఓకే అన్నాను. అయితే ఇప్పుడు మా టీవీలో షో చేస్తున్నాను. కొన్ని గొడవలు అవుతుంటాయి.
నాకు గొడవలు అంటే ఇష్టం. కాకపోతే ఇప్పుడే గొడవలు పడితే బాగుండదు కదా అని చెప్పుకొచ్చింది సౌమ్య. ఇక తన పై వచ్చిన విమర్శల గురించి సౌమ్య రావు మాట్లాడింది. తన గురించి చాలా మంది దారుణంగా మాట్లాడారని, ఇష్టమొచ్చినట్టు తిట్టారని, పాత యాంకర్లను చూసి నేర్చుకో అని కామెంట్స్ చేశారని తెలిపింది సౌమ్య. నువ్వు యాంకర్ గా పనికిరావు, ఆ యాంకర్ దరిద్రంగా ఉంది, అసహ్యంగా ఉంది, చూడటానికి గ్లామర్ గా లేదు అని కామెంట్స్ చేశారు. ఆడియన్స్ కొంతమంది నన్ను యాంకర్ గా ఒప్పుకున్నారు. కొంతమంది నన్ను ఒప్పుకోలేదు. నా వచ్చి రాని తెలుగును కూడా ఎంజాయ్ చేశారు. ఆమె యాంకర్ ఏంటి.? తెలుగులో చాలా మంది అమ్మాయిలు ఉన్నారుగా ఈమెనే యాంకర్ చెయ్యాలా అని అన్నారు. కొంతమంది నన్ను బాగా సపోర్ట్ చేశారు. నన్ను విమర్శించిన వారిని ఎలా ఇంప్రస్ చెయ్యాలో నాకు తెలియదు అని అన్నారు.