Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home వార్త‌లు

Kantara Review:కాంతార రివ్యూ… అద‌ర‌గొట్టేశాడుగా..!

Shreyan Ch by Shreyan Ch
October 15, 2022
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Whatsapp

Kantara Review: గ‌త కొద్ది రోజులుగా అంద‌రి నోళ్ల‌లో నానుతున్న క‌న్న‌డ చిత్రం కాంతార‌. రిషబ్ శెట్టి కథానాయకుడిగా రూపొందిన ఈ సినిమా గ‌త నెల 30వ తేదీన కన్నడలో విడుదలైన సంచలన విజయాన్ని నమోదు చేసింది. హోంబలే ఫిలిమ్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మితమైన ఈ సినిమా తెలుగు వెర్షన్ ను గీతా ఆర్ట్స్ వారు నేడు విడుద‌ల చేశారు. సప్తమి గౌడ కథానాయికగా అలరించిన ఈ సినిమాలో, కిశోర్ .. అచ్యుత్ కుమార్ .. ప్రమోద్ కుమార్ … మనసి సుధీర్ ముఖ్యమైన పాత్రలను పోషించారు.

ఈ చిత్రం అడ‌వి నేప‌థ్యంలో న‌డిచే క‌థ‌. రాజ్యాన్ని పాలించే రాజు ఒక దైవదూత సూచన మేరకు తన ఐదొందల ఎకరాల భూమిని గిరిజనులకు రాసిచ్చేస్తాడు. కాల క్రమంలో అతడి వారసుడొకరు ఆ భూమిని తనకి ఇచ్చేయాలని గిరిజనుల మీద ఒత్తిడి తెస్తాడు. కానీ అతను అనూహ్య పరిణామాల మధ్య రక్తం కక్కుకుని చనిపోతాడు. ఇంకో తరం మారాక ఆ చనిపోయిన వ్యక్తి కొడుకైన దేవేంద్ర (అచ్యుత్ కుమార్) గిరిజనులతో సన్నిహితంగా మెలుగుతుంటాడు. అతడి దగ్గర పని చేస్తూ తన ఊరి వాళ్లకు తలలో నాలుకలా ఉండే శివ (రిషబ్ శెట్టి)కి.. కొత్తగా అటవీ అధికారిగా వచ్చిన మురళి (కిషోర్)కి తగువు మొదలవుతుంది. కొన్ని పరిణామాల తర్వాత శివ సోదరుడు చనిపోతాడు. అతణ్ని చంపింది మురళీనే అనుకుంటాడు శివ. ఇంతకీ శివ సోదరుడిని చంపిందెవరు.. అందుకు కారణమేంటి.. బదులుగా శివ ఏం చేశాడు అన్నది మిగతా కథ.

రంగస్థలంలో జగపతిబాబు, ప్రకాశ్ రాజ్ ఇద్దరూ ఒకే పాత్రలో కనిపిస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుందో ఇందులోని అచ్యుత్ కుమార్ పాత్ర అలానే ఉంటుంది. ఆ రకంగా స్క్రీన్ ప్లే, గ్రామీణ నేపథ్యాలు రంగస్థలాన్ని గుర్తు చేస్తుంటాయి. మూడు టైం లైన్స్ లో కొనసాగే కథతో సూపర్ నేచురల్ అంశాలతో కూడిన మిస్టరీ కోణం తుంబాడ్ నుంచి స్ఫూర్తి పొందినట్టు అనిపిస్తుంది.

అడవి నేపథ్యంలోని సన్నివేశాలను గొప్పగా తెరకెక్కించాడు. బురదలోను .. వానలోను వచ్చే ఫైట్స్ ను చాలా బాగా చిత్రీకరించాడు. ఇక ఎడిటింగ్ కి వంక బెట్టవలసిన అవసరమే లేదు. లవ్ .. యాక్షన్ .. ఎమోషన్ .. కామెడీ కథలో సర్దిన తీరు బాగుంది. అయితే అడవి నేపథ్యంలో నడిచే కథ అనగానే ప్రేక్షకులు కాస్త నాటు సరసాన్ని .. మోటు శృంగారాన్ని ఆశిస్తారు. అలాంటివారికి మాత్రం కాస్త నిరాశ తప్పదనే చెప్పాలి. అవకాశం ఉన్నప్పటికీ రిషబ్ శెట్టి అటువైపు వెళ్లకపోవడం కాస్త అసంతృప్తిని కలిగిస్తుందంతే. హీరోగా .. రచయితగా .. దర్శకుడిగా రిషబ్ శెట్టి చేసిన ఈ విన్యాసాన్ని మాత్రం త‌ప్ప‌క అభినందించాలి.

Tags: kantarakantara reviewrishab shetty
Previous Post

Alli Arjun : రాజ‌మౌళి, అల్లు అర్జున్ పేర్ల‌తో బ‌డా మోసం.. రూ.6 కోట్లు చీట్ చేశార‌ట‌..

Next Post

Sri Reddy : బాబోయ్ శ్రీరెడ్డి క‌ల్లు తాగుతూ చేస్తున్న హంగామా చూశారా..!

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

ఆహారం

Karivepaku Pachadi : క‌రివేపాకు ప‌చ్చ‌డి ఎంతో ఆరోగ్య‌క‌రం.. ఎలా చేయాలంటే..?

by editor
February 8, 2023

...

Read moreDetails
వార్త‌లు

Inaya Sulthana : వామ్మో.. ఇనయా సుల్తానా ఏంటి.. ప‌బ్లిగ్గా ఇలా చేస్తోంది..!

by Shreyan Ch
August 29, 2024

...

Read moreDetails
వార్త‌లు

Mohan Babu : ఎన్టీఆర్ సినిమా నుండి చిరంజీవిని తీసేసి మోహ‌న్ బాబుని పెట్టారా..కార‌ణం ఏంటంటే..!

by Shreyan Ch
September 26, 2022

...

Read moreDetails
ఆరోగ్యం

Leg Cramps At Night : నిద్రలో కాలి పిక్క‌లు ప‌ట్టేస్తున్నాయా.. అయితే అందుకు కార‌ణం ఇదే.. ఏం చేయాలంటే..?

by editor
February 10, 2023

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.