Kantara : ఓటీటీలోకి వ‌చ్చేసిన కాంతారా.. వ‌రాహ రూపం పాట కూడా..!

Kantara : కాంతార.. ఇప్పుడు ఎక్కడ చూసిన దీని గురించే చర్చ జరుగుతోంది. రిషబ్ శెట్టి హీరోగా వచ్చిన ఈ కన్నడ సినిమా కన్నడలో కంటే తెలుగులో మంచి వసూళ్లను రాబట్టింది. ఈ సినిమాను తెలుగులో అల్లు అరవింద్ నిర్మాతగా గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అక్టోబర్ 15న విడుదల చేశారు. థియేటర్లలో విడుదలైన తొలి రోజు నుంచే పాజిటివ్ టాక్‌ తో దూసుకుపోయింది. ఇటీవలే 50 రోజులు దిగ్విజయంగా పూర్తి చేసుకున్న ఈ కన్నడ బ్లాక్‌బస్టర్ కన్నడ, తెలుగు, తమిళ్, మలయాళ భాషల్లో అమెజాన్ ప్రైమ్ వేదికగా ఓటీటీలో విడుదలైంది. ఈ సినిమా చుట్టూ ఉన్న ఒకేఒక్క వివాదానికి తాజాగా తెరపడింది.

ఈ సినిమాకే హైలైట్‌గా నిలిచిన వరాహ రూపం పాట సినిమాలో ప్రదర్శించరాదంటూ దాఖలైన అన్ని పిటిషన్లను కేరళ హైకోర్టు బుధవారం కొట్టేసింది. దీంతో.. కాంతార సినిమాకు ఓటీటీలో విడుదలయ్యే కొద్ది గంటల ముందు అన్ని ఆటంకాలు తొలగిపోయాయి. కాంతార సినిమాలో బాగా పాపులర్ అయిన వరాహ రూపం పాటను థియేటర్లలో ప్రదర్శించరాదంటూ కేరళ కోర్టు గతంలో తీర్పునిచ్చింది. తైక్కుడం బ్రిడ్జ్ మ్యూజిక్ బ్యాండ్ అనుమతి లేకుండా ఆ పాటను థియేటర్లలో ప్రదర్శించకూడదని కొజికొడె జిల్లా సెషన్స్ జడ్జ్ తీర్పునిచ్చారు. చిత్ర నిర్మాత, దర్శకుడు, సంగీత దర్శకుడు, అమెజాన్, యూట్యూబ్, స్పాటిఫై, వింక్ మ్యూజిక్, జియోసావన్.. ఈ ఫ్లాట్‌ఫామ్స్ ఏవీ తైక్కుడం బ్రిడ్జ్ మ్యూజిక్ బ్యాండ్ అనుమతి లేకుండా పాటను ప్లే చేయకూడదని కూడా కోర్టు స్పష్టం చేసింది.

Kantara movie now streaming on ott with varaha rupam song
Kantara

అక్టోబర్ 24న తైకుడం బ్రిడ్జ్ మ్యూజిక్ బ్యాండ్ ఇన్‌స్టాగ్రాం పేజ్ వేదికగా కాంతార సినిమా మేకర్స్‌పై తీవ్ర ఆరోపణలు చేసింది. కాపీరైట్ నిబంధనలను ఉల్లంఘించి తమ నవరసం అనే పాట నుంచి వరాహ రూపం అనే పాటను కాపీ చేసి సినిమాలో వాడుకున్నారని ఆరోపించింది. కాంతార సినిమా యూనిట్‌ తమను సంప్రదించకుండా పాటను కాపీ చేయడంపై న్యాయపరంగా తేల్చుకుంటామని తైకుడం బ్రిడ్జ్ మ్యూజిక్ బ్యాండ్ యాజమాన్యం కోర్టుకెక్కింది. ఎట్టకేలకు వరాహ రూపం సినిమాపై నెలకొన్న ఈ వివాదంపై కాంతార చిత్ర బృందానికి అనుకూలంగా తీర్పు రావడంతో వివాదం సమసిపోయినట్టే కనిపిస్తోంది.

Share
Usha Rani

Recent Posts

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

2 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

2 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

2 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

2 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

2 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

2 months ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

2 months ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

2 months ago