Kamal Haasan : లోకనాయకుడు, ఉలగనాయకన్ కమల్‌హాసన్ ఎంతో గొప్ప హీరో అనే విషయం మనకు తెలిసిందే. భారతదేశం గర్వించదగ్గ గొప్ప హీరోల లిస్టులో కమల్ ఖచ్చితంగా ఉంటాడు. ఈ హీరో చేసినన్ని ప్రయోగాలు ఏ స్టార్ హీరో కూడా చేయలేదు . సినిమాల జయాపజయాలతో సంబంధం లేకుండా కమల్ ఎన్నో గొప్ప ప్రయోగాలు చేసి అదరహో అనిపించారు.. కమల్ కెరీర్ స్టార్టింగ్ నుంచి గతేడాది వచ్చిన విక్రమ్ వరకు సాహసాలు చేసుకుంటూనే వెళ్లాడుడు. తన సినిమాలతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్న కమల్ వ్యక్తిగత, వైవాహిక జీవితాల విషయంలో మాత్రం ఎప్పుడూ వివాదాలు, విమర్శలు ఉండేవి.
కమల్ వైవాహిక జీవితంలో చాలా మందికి రెండు పెళ్లిళ్లు, ఓ సహజీవనం గురించి మాత్రమే తెలుసు. అని తెలియని సీక్రెట్ ఏంటంటే.. తొలుత కమల్ హాసన్ శ్రీ విద్యను ప్రేమించానని చెప్పి, పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చారట. ఈ విషయం స్వయంగా ఆమె ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. కమల్ , మా రెండు కుటుంబాలు చాలా ఏళ్లుగా ఒకరికొకరం తెలుసు. మా అమ్మ ప్రముఖ కర్ణాటక సంగీత గాయణీమని ఎం.ఎల్. వసంత కుమారి కాగా, మా పేరెంట్స్ మధ్య గొడవలు వచ్చి నా చిన్నప్పుడే విడిపోయారు. నేను 13 ఏళ్లకే సినిమాల్లో చేరాను. కమల్ హాసన్ నన్ను ప్రేమిస్తున్నాడని చెప్పే సమయానికి నా వయస్సు 22 ఏళ్లు.
కమల్ ఆ మాట చెప్పినప్పటి నుండి ఎంతో ఆరాధించాను. నా జీవితం ఆయనకే అంకితం చేయాలని అనుకున్నాను. కాని అప్పుడు వాణి గణపతిని పెళ్లి చేసుకోబోతున్నట్టు చెప్పాడు కమల్. ఆ సమయంలో నా నోట మాట రాలేదు. నా కోసం ఎదురు చూడు అని ఆయన చెప్పిన మాటలు ఇప్పటికీ గుర్తు ఉన్నాయి అని శ్రీ విద్య అన్నారు. అయితే ఈమె దర్శకుడు భరతన్ తో కొద్ది రోజుల పాటు రిలేషన్ లో ఉంది. అతనితో బ్రేకప్ తరువాత.. మలయాళ పరిశ్రమకు చెందిన జార్జ్ థామస్ ని వివాహం చేసకోగా, కొద్ది కాలానికే వారు విడిపోయారు. గొడవలు, కేసులు, వివాదాలతో ఆమె జీవితం దారుణంగా మారింది. 2003లో స్పైన్ క్యాన్సర్ కి గురైన శ్రీవిద్య 2006లో కన్ను మూసారు. అయితే ఆమె ఆస్తి అంతటిని ఛారిటీకి ఇచ్చేసింది.